Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammed Siraj ఆ కుర్రాడికి సారీ చెప్పాన్రా అయ్యా.. సిరాజ్ రియాక్షన్!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా ఎదుగుతున్న పేసర్లలో మహమ్మద్ సిరాజ్ ఒకడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో సిరాజ్ ఒక సూపర్ ఆయుధంగా మారుతున్నాడు. అదే సమయంలో కోహ్లీ నుంచి ఎగ్రెషన్ కూడా నేర్చుకుంటున్నాడీ హైదరాబాద్ పేసర్. తాజాగా ఐపీఎల్ 2023లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఘటనే జరిగింది.

తాజాగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ఛేజింగ్‌లో 19వ ఓవర్లో సిరాజ్ బంతి అందుకున్నాడు. అతను వేసిన బంతిని రాజస్థాన్ ప్లేయర్ ధృవ్ జురెల్ సరిగా ఆడలేకపోయాడు. అయితే వేగంగా డబుల్ తీయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బంతి అందుకున్న ఫీల్డర్ మహిపాల్ లోమ్రోర్ వేగంగా రియాక్ట్ అయ్యాడు.

Mohammed Siraj apologises

అయితే అతను వేసిన త్రో.. సిరాజ్ వైపు సరిగా క్యారీ అవ్వలేదు. దీంతో క్రీజు వరకు రాకపోయినా సరే అశ్విన్ రనౌట్ మిస్ అయ్యాడు. దీంతో సిరాజ్‌కు చిర్రెత్తుకొచ్చింది. త్రో సరిగా వేయలేదనే కోపంతో లోమ్రోర్‌ను బూతులు తిట్టేశాడు. ఫ్యాన్స్‌కు ఇది ఏమాత్రం నచ్చలేదు. దీంతో సిరాజ్‌ను తెగ ట్రోల్ చేశారు. ఈ ప్రవర్తన కరెక్ట్ కాదని సిరాజ్‌ను తిట్టిపోశారు. దీనిపై సిరాజ్ స్పందించాడు.

తనకు బాగా కోపం వచ్చిందని, అందుకే అలా అరిచేశానని చెప్పాడు. అయితే ఆ తర్వాత లోమ్రోర్‌ను కలిసి సారీ కూడా చెప్పేశానని వెల్లడించాడు. 'నాకు చాలా కోపం వస్తుంది. సారీ.. ఈ విషయంలో నేను లోమ్రోర్‌కు ఇప్పటికే రెండు సార్లు సారీ చెప్పా. మైదానంలో ఉండే ఎగ్రెషన్‌ను నేను మైదానం బయటకు వచ్చాక కంటిన్యూ చేయను. మ్యాచ్ ముగిసిన తర్వాత అంతా కామ్ అయిపోతాను' అని చెప్పాడు.

ఈ గొడవను లోమ్రోర్ కూడా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు. 'ఏం పర్లేదు సిరాజ్ భాయ్. ఇలాంటి పెద్ద మ్యాచుల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి' అని చెప్పాడు. ఇలా ఇద్దరూ ఈ ఘటనపై స్పందించిన వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మేనేజ్‌మెంట్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఇప్పటికైనా కొందరు నెటిజన్లు మరీ ఎక్కువ రియాక్ట్ అవకపోతే బాగుంటుందని అంటున్నారు.

Story first published: Monday, April 24, 2023, 15:20 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+