ఐపీఎల్ 2023లో బలమైన జట్లుగా పేరొందిన పంజాబ్ కింగ్స్, రాాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడేందుకు రెడీగా ఉన్నాయి. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు చేసేందుకు కొందరు బ్యాటర్లు రెడీగా ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు అందరూ తమ జట్టును గెలిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్లెవరంటే..
ఫాప్ డుప్లెసిస్: ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా ఆడుతున్న ప్లేయర్. చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా అద్భుతంగా ఆడాడు. కానీ ఆ మ్యాచ్‌లో తమ జట్టును గెలిపించుకోలేకపోయాడు. ప్రస్తుతం ఐదు మ్యాచుల్లో 259 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న అతను..

ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. ఆర్సీబీ గెలుపు ఓటములతో దాగుడు మూతలు ఆడుతున్నా.. డుప్లెసిస్ మాత్రం తమ జట్టును గెలిపించేందుకే కృషి చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతను ఇలాగే చెలరేగే అవకాశం ఉంది.
మాథ్యూ షార్ట్: జానీ బెయిర్‌స్టో వంటి భీకర బ్యాటర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు పంజాబ్ కింగ్స్ తీసుకున్న మాథ్యూ షార్ట్.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇటీవల ఆడిన మ్యాచుల్లో కొంత వరకు ఫర్వాలేదు అనిపించినా కూడా.. తనదైన స్టైల్‌లో భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. అయితే బాగా తడబడుతున్న ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్‌పై అతను ఎదురు దాడి చేసి భారీ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అతను రెచ్చిపోతే పంజాబ్ భారీ స్కోరు చేయడం ఖాయం.
విరాట్ కోహ్లీ: ఈ సీజన్ ఆరంభం నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడుతున్న ప్లేయర్లలో కోహ్లీ ఒకడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో దురదృష్టంకొద్దీ అవుటైన అతను.. అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఎటాకింగ్ గేమ్ ఆడాడు. ముంబైతో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే తన ఇంటెన్షన్స్ ఏంటో స్పష్టంగా చూపెట్టిన అతను.. తనకు మంచి రికార్డులు ఉన్న మొహాలీలో చెలరేగేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కనుక క్లిక్ అయితే.. ఆర్సీబీ గెవడం గ్యారంటీ.