Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsPBKS : ఏడాది తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో.. పంజాబ్‌తో మ్యాచ్‌లో ట్విస్ట్ ఇచ్చిన ఆర్సీబీ!

పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఆర్సీబీ యాజమాన్యం. ఈ మ్యాచ్‌లో జట్టు పగ్గాలను విరాట్ కోహ్లీకి అప్పగించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌కు గాయమైందన్న సంగతి తెలిసిందే. దీంతో అతను ఈ మ్యాచ్‌లో పూర్తిగా ఆడటం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగుతాడట. ఈ క్రమంలోనే కెప్టెన్సీని కోహ్లీకి అప్పగించింది.

గతేడాది పని ఒత్తిడి కారణంగా ఆర్సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. మళ్లీ ఇన్నాళ్లకు కెప్టెన్సీ చేస్తుండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. తమ జట్టులో పెద్దగా మార్పులేవీ లేవని, ఫీల్డింగ్ సమయంలో ఫాఫ్ ఆడటం లేదని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. అలాగే ఫీల్డింగ్ సమయంలో విజయ్‌కుమార్ వైశాఖ్ జట్టులోకి వస్తాడని వెల్లడించాడు.

Virat Kohli capitaining RCB after a year

ఇక పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ కూడా భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. శామ్ కర్రాన్ కెప్టెన్సీలోనే ఈ జట్టు బరిలో దిగుతోంది. ఈ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు కర్రాన్ తెలిపాడు. విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ జట్టుతో చేరినట్లు చెప్పాడు. అతను ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.

గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన సికందర్ రజాను పక్కన పెట్టినట్లు కర్రాన్ తెలిపాడు. అతని స్థానంలోనే లివింగ్‌స్టోన్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రమాదకర సఫారీ బౌలర్ కగిసో రబాడను కూడా పక్కన పెట్టామని, అతని స్థానంలో నాథన్ ఎల్లీస్‌ను ఆడిస్తున్నామని వెల్లడించాడు. ఈ రెండు మార్పులతో తాము బరిలో దిగుతున్నామని, ధవన్ దాదాపు కోలుకున్నాడని చెప్పాడు.

ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సూయష్ ప్రభుదేశాయి, వేన్ పార్నెల్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

పీబీకేఎస్ జట్టు: అథర్వ టైడే, హర్‌ప్రీత్ భాటియా, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, శామ్ కర్రాన్ (కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్

Story first published: Thursday, April 20, 2023, 15:25 [IST]
Other articles published on Apr 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+