ప్రస్తుతం ఐపీఎల్ 2023లో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఒకడు. ఈ జట్టును ముందుండి నడిపిస్తున్న ఫాఫ్.. ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని గెలిపించినంత పని చేసిన అతను.. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు.
చెన్నైతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను.. డైవ్ చేసే క్రమంలో గాయపడ్డాడు. ఈ గాయం కారణంగానే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసేందుకు అతను వచ్చాడు. ఈ క్రమంలోనే పవర్‌ప్లేలో ధనాధన్ ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం డుప్లెసిస్ వద్దనే ఉంది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో తన ఆరెంజ్ క్యాప్‌ను ఇప్పుడప్పుడే ఎవరికీ ఇచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టమైన సంకేతాలు పంపాడు. పక్కటెముకల నొప్పితో బాధ పడుతూ కూడా భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో 300 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన మ్యాచుల్లోనే డుప్లెసిస్ రాణించలేదు. ఈ రెండు మ్యాచుల్లో 30 పరుగుల స్కోరు దాటలేదు. మిగతా మూడు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇప్పుడు పంజాబ్‌పై మరో సూపర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారని అందరికీ తెలిసిందే.
కానీ డుప్లెసిస్ మాత్రం ఈ విషయంలో తన బ్యాటింగ్‌ను చాలా మెరుగు పరుచుకున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో కూడా అద్భుతమైన స్ట్రైక్ రేటుతో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు అతని బ్యాటింగ్ చూస్తే.. డుప్లెసిస్ నుంచి ఆరెంజ్ క్యాప్ తీసుకోవడం మిగతా బ్యాటర్లకు చాలా కష్టంగా కనిపిస్తోంది. ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ నుంచి అతనికి గట్టి పోటీ ఉంది.