Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsMI : రోహిత్‌ను దాటేసిన కోహ్లీ.. హైఓల్టేజ్ మ్యాచ్‌లో బద్దలైన రికార్డులు!

ఐపీఎల్ 2023ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఘనంగా ఆరంభించింది. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టు అయిన ముంబైపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (82 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్ (73) ఇద్దరూ అదరగొట్టారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 8 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ఈ సూపర్ హిట్ పోరులో పలు కీలక రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఒకసారి చూస్తే..

ఆర్సీబీ ఓల్డ్ రికార్డు

ముంబైతో జరిగిన మ్యాచులో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ చెలరేగారు. ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై ఎదురు దాడికి దిగిన వీళ్లు.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. అసలు ఈ ఇద్దరే టార్గెట్ ఛేజ్ చేసేస్తారని అనిపించింది. అయితే 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డుప్లెసిస్ అవుటవడంతో ఈ పార్టరన్‌షిప్ విడిపోయింది.

అప్పటికి వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జతచేశారు. ఆర్సీబీ తరఫున తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు ఈ రికార్డు గేల్, మయాంక్ జోడీ పేరిట ఉండేది. వాళ్లిద్దరూ 2011లో తొలి వికెట్‌కు 113 పరుగులు జతచేశారు. ఇప్పుడు కోహ్లీ, డుప్లెసిస్ ఈ రికార్డు బద్దలు కొట్టారు.

Virat Kohli surpass Rohit Sharma 22

రోహిత్‌ను దాటేసిన కింగ్

ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లోనే తన మూడ్ ఏంటో కోహ్లీ చాటిచెప్పాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచాడీ సూపర్ స్టార్. ఈ మ్యాచ్‌లో అతను 167.34 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించాడు.

ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 150పైగా స్ట్రైక్ రేటుతో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇప్పటికి 23 సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 22 సార్లు ఈ ఫీట్ సాధించాడు.

డుప్లెసిస్ అరుదైన రికార్డు

ఆర్సీబీ కొత్త కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. గతేడాది ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్‌కు రోహిత్ సేనపై ఇది వరుసగా రెండో విజయం. ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలో నెగ్గిన రోహిత్‌పై మరే విదేశీ కెప్టెన్ ఇలా వరుసగా రెండు మ్యాచులు గెలవలేదు. గతేడాది ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడినా.. ఒక మ్యాచ్‌లో రోహిత్ ఆడలేదు.

ఆ తర్వాత రోహిత్ వచ్చినా ముంబై తలరాత మారలేదు. ఆర్సీబీ చేతిలో ఓడింది. ఇప్పుడు మరోసారి ఓడింది. ఐపీఎల్‌లో మరే విదేశీ కెప్టెన్ కూడా రోహిత్ కెప్టెన్సీలోని ముంబై చేతిలో ఒక్కసారి కూడా ఓడకుండా ఇలా రెండుసార్లు గెలవలేదు. ప్రస్తుతం డుప్లెసిస్ ఒక్కడే ఈ మినీ మ్యాచప్‌లో 2-0తో పైచేయి సాధించాడు. ఇది అతనికే సాధ్యమైన రికార్డు మరి.

Story first published: Monday, April 3, 2023, 12:18 [IST]
Other articles published on Apr 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+