ఆర్సీబీతో ఆడిన ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడింది. కొన్ని రోజులుగా నెట్స్‌లో తెగ శ్రమ చేస్తున్న ముంబై బ్యాటర్లు.. అసలు మ్యాచ్‌లో చేతులు ఎత్తేశారు. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అవుటైన విధానం అభిమానులకు తెగ కోపం తెప్పిస్తోంది. అప్పటికే ఒక జీవనదానం లభించినా కూడా రోహిత్ దాన్ని సరిగా వాడుకోలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో పది బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అంతకుముందు మహమ్మద్ సిరాజ్ వేసిన షార్ట్ బంతిని పుల్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. అయితే సిరాజ్, దినేష్ కార్తీక్ ఢీకొట్టుకొని ఆ క్యాచ్ నేలపాలు చేశారు. ఇలా లైఫ్ దక్కడంతో రోహిత్ రెచ్చిపోతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ తర్వాత కాసేపటికే ఆకాష్ దీప్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడబోయిన రోహిత్.. కీపర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

దీంతో అభిమానులు రోహిత్‌పై మండి పడుతున్నారు. 2017 నుంచి ఐపీఎల్‌లో రోహిత్ చెత్త ప్రదర్శన చేస్తున్నాడని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ సీజన్లలో రోహిత్ యావరేజ్‌లు వరుసగా 23.79, 23.83, 28.93, 27.67, 29.31గా ఉన్నాయి. ఇక గతేడాది అయితే అత్యంత ఘోరంగా 19.14 సగటుతో పరుగులు చేశాడీ హిట్‌మ్యాన్. చివరగా రోహిత్ హాఫ్ సెంచరీ చేసి కూడా రెండేళ్లు అయిపోతోంది. 2021 ఐపీఎల్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక అప్పటి నుంచి రోహిత్ ఫామ్ దిగజారుతూనే ఉంది. ఆ తర్వాత 22 ఇన్నింగ్సులు ఆడినా కూడా అతను ఒక్క అర్ధశతకం కూడా చెయ్యలేదు. అతని ఫిట్‌నెస్ కూడా దిగజారుతోంది. ఆర్సీబీ మ్యాచ్‌లో పుల్ షాట్ ఆడేందుకు అతను ప్రయత్నించినప్పుడు.. రోహిత్ పొట్ట బాగా కనిపించింది. ఈ ఫొటోను నెట్టింట షేర్ చేస్తున్న కొందరు 'రోహిత్ మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి' అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ మొదలవడానికి ముందే రోహిత్ రిటైర్ అయిపోవడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. మరుసటి మ్యాచుల్లో అయినా రోహిత్ రాణించి, ఈ విమర్శకుల నోటికి తాళం వేస్తాడేమో చూడాలి.