Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsMI : నీ ఏజ్ ఏంది? ఈ క్యాచ్ ఏంది?.. ఆర్సీబీ కెప్టెన్ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

ఐపీఎల్ 2023లో తమ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అదరగొట్టింది. అన్ని విభాగాల్లో ముంబైపై ఆధిపత్యం చెలాయించిన ఈ జట్టు అద్భుతమైన విజయం తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (82 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్ (73) ఇద్దరూ ఆర్సీబీ విజయానికి బాటలు వేశారు. చివరకు భారీ సిక్సర్‌తో తనదైన స్టైల్‌లో కోహ్లీ ఈ మ్యాచ్‌ను ముగించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డుప్లెసిస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టుకున్న బౌలర్లు ముంబై టాపార్డర్‌ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (84 నాటౌట్) ఆ జట్టును ఆదుకున్నాడు. అద్భుతమైన పోరాటంతో ముంబైకి 171 పరుగుల పోరాడగలిగే స్కోరు అందించాడు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ, డుప్లెసిస్ ఈ టార్గెట్ తమకు సరిపోదని నిరూపించారు.

RCBvsMI who won yesterday match du Plesis stunning catch

ముంబై బ్యాటింగ్ సమయంలో తిలక్ వర్మ ఒక ఎండ్‌లో అదరగొడుతుంటే.. అతనికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. ఇలాంటి సమయంలో హృతిక్ షోకీన్ 8వ నెంబర్ బ్యాటర్‌గా బరిలో దిగాడు. తను కూడా కొన్ని మంచి షాట్లు ఆడి జట్టు స్కోరుకు యాడ్ చేయాలని అతను అనుకున్నాడు. ఈ క్రమంలోనే హర్షల్ పటేల్ వేసిన బంతిని కవర్స్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ షాట్‌లో పెద్దగా బలం లేకపోవడంతో థర్టీ యార్డ్ సర్కిల్ దాటిన ఆ బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు.

అప్పుడు సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ వేగంగా పరిగెత్తుతూ.. ముందుకు డైవ్ చేసి మరీ ఆ క్యాచ్ పట్టేశాడు. తను బంతిని ఛేజ్ చేసేందుకు రెడీ అవుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ క్యాచ్ చూసి ఆశ్చర్యపోయాడు. జట్టులో సీనియర్ ప్లేయర్ అయిన డుప్లెసిస్ ఈ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడం చూసిన ఫ్యాన్స్ కూడా.. అతని ఫిట్‌నెస్ చూసి నోరెళ్లబెట్టారు. 'అసలు నీ ఏజ్ ఎంత? ఇలాంటి క్యాచులు పట్టేస్తున్నావ్?' అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మ్యాచ్ అనంతరం ఇలా క్యాచులు పట్టే ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తోందని డుప్లెసిస్‌ను ప్రశ్నించగా.. 'ఎక్కువగా కుర్రాళ్లతో కలిసి ఆడుతుండాలి. నేను కూడా వాళ్లలా కదిలేందుకు ఏం చేయాలో అంతా చేస్తా. నేను వయసులో ఉండగా ఎలా ఆడేవాడినో.. అలా ఆడేందుకు ఎంత ఫిట్‌గా ఉండాలో అంత ఫిట్‌గా ఉండేందుకు ట్రై చేస్తా' అని నవ్వేశాడీ 38 ఏళ్ల ఆర్సీబీ కెప్టెన్. డుప్లెసిస్ ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించని సంగతి తెలిసిందే. దీంతో అతన్ని మళ్లీ సఫారీ జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ బోర్డు ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Story first published: Monday, April 3, 2023, 8:53 [IST]
Other articles published on Apr 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+