Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsMI : 92 ఏళ్ల బామ్మ కూడా.. కోహ్లీ ఆటకు ఫిదా.. అతన్ని చూసేందుకే వచ్చిందట!

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. దేశంలో ఏ మూలకు వెళ్లినా కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు. ఏ వయసు వారైనా అతని క్లాసిక్ ఆటకు ఫిదా అవ్వాల్సిందే. ఈ విషయాన్ని ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో మూడేళ్ల తర్వాత ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుందంటే ఎంత జోష్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఆ జోష్ కేవలం ఒక ఏజ్ గ్రూప్‌కే పరిమితం కాదని ఒక బామ్మ నిరూపించింది. 92 ఏళ్ల వయసున్న ఆమె.. కేవలం కోహ్లీ ఆటను చూసేందుకు పనికట్టుకొని స్టేడియానికి వచ్చింది. మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. తను కోహ్లీ ఆడటం ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చానని సంతోషంగా చెప్పింది. ఆమె ఫొటోలను నెట్టింట పంచుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్.. 'ఇది మా కింగ్ ఫాలోయింగ్' అంటూ తెగ్ వైరల్ చేస్తున్నారు.

virat kohli rcb batting

ఈ బామ్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోహ్లీ వమ్ము చేయలేదు. ముంబైతో జరిగిన ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్‌లో చెలరేగాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం అందించాడు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 148 పరుగులు జోడించారు. ఆ తర్వాత డుప్లెసిస్ (73) అవుటైనా కూడా కోహ్లీ మాత్రం తన జోరు తగ్గించలేదు. ఆర్సీబీ విజయానికి ఆరు పరుగులు అవసరమైన సమయంలో భారీ సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు.

ఆట ముగిసే సమయానికి కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్ చూసిన వాళ్లందరూ అతన్ని తెగ మెచ్చుకుంటున్నారు. కోహ్లీ ఫామ్‌లో ఉంటే క్రికెట్ ఇంత ఈజీనా? అనేలా ఆడతాడని, ముంబైతో మ్యాచ్‌లో అదే కనిపించిందని కొనియాడుతున్నారు. ఫ్యాన్స్ కూడా కోహ్లీ తన పూర్వవైభవం దిశగా అడుగులు వేయడం చూసి తెగ సంతోషిస్తున్నారు. ఈ బామ్మ చూడాలనుకున్న ఇన్నింగ్స్ కోహ్లీ చూపించాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Monday, April 3, 2023, 16:22 [IST]
Other articles published on Apr 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+