Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsLSG : చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. అరుదైన రికార్డు!

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్‌గా వచ్చిన కింగ్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. లక్నో ప్రధాన పేసర్ మార్క్ వుడ్‌ బౌలింగ్‌లో కూడా కోహ్లీ సూపర్ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో 44 బంతుల్లో 61 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ మొదలైనప్పుడు సన్‌రైజర్స్ స్థానంలో హైదరాబాద్ నుంచి డెక్కన్ చార్జర్స్ టీం ఆడేదనే సంగతి తెలిసిందే. ఆ టీంపై కోహ్లీ అత్యధిక స్కోరు 99. ఇక చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలపై నిషేధం విధించిన సమయంలో రెండు కొత్త జట్లు ఐపీఎల్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పూణే తరఫున రెండేళ్లలో రెండు ఫ్రాంచైజీలు ఆడాయి. అవే రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పూణే వారియర్స్. ఈ రెండు జట్లపై కూడా కోహ్లీ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

King Kohli creates history with half century

అలాగే ఆ మధ్య ఆడిన గుజరాత్ లయన్స్‌పై ఏకంగా సెంచరీ (109) చేశాడు. మొత్తం నాలుగు ఫ్రాంచైజీలపై కోహ్లీ సెంచరీలు చేశాడు. అవి పంజాబ్ కింగ్స్, గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్. ఇక గతేడాది కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌పై కూడా గత సీజన్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. లక్నోపై తాజాగా 61 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ ఆడిన 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై 50+ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా కోహ్లీనే. అలాగే కెప్టెన్‌గా ఎక్కువ పరుగులు చేసింది కూడా అతనే. కానీ ఎన్ని చేసినా అతని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2016లో ఫైనల్ చేరినా.. చివర్లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయింది. ఇక గతేడాది ఎలిమినేటర్-2 వరకు వెళ్లి తిరిగొచ్చింది.

Story first published: Tuesday, April 11, 2023, 11:33 [IST]
Other articles published on Apr 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+