Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsLSG : ఆ ఆరు ఓవర్ల ఆటే రెండు టీమ్స్ మధ్య తేడా: ఫాఫ్ డుప్లెసిస్

లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది. ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో టీంను ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ (31), ఫాఫ్ డుప్లెసిస్ (44) ఇద్దరూ చక్కగా రాణించారు. కానీ మిగతా ఎవరూ బ్యాటుతో ఆకట్టుకోలేదు.

దీంతో ఆర్సీబీ జట్టు కేవలం 127 పరుగులే చేయగలిగింది. అయితే లక్ష్య ఛేదనలో లక్నో పూర్తిగా తేలిపోయింది. తొడ కండరాల గాయంలో రాహుల్ ఓపెనర్‌గా రాలేదు. మిగతా బ్యాటర్లలలో కృష్ణప్ప గౌతమ్ (23) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా అతని స్కోరును అధిగమించలేదు.

Faf Du Plessis Reaction

ఆర్సీబీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో.. లక్నో 108 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయం అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మాట్లాడాడు. 'బెంగళూరుతో పోలిస్తే ఇక్కడి పిచ్ పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి వికెట్‌పై మొదటి ఆరు ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే మాకు కలిసొచ్చింది' అని డుప్లెసిస్ వెల్లడించాడు.

'పవర్ ప్లేలో మేం చేసిన స్కోరే రెండు జట్ల మధ్య తేడా. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయమే కీలకం. వాళ్ల దగ్గర నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వాళ్లను ఎదుర్కోవడం కష్టం. బంతి ఎటు పోతుందో అర్థం కాలేదు. ఇక్కడ 135 పరుగుల స్కోరు చేస్తే చాలని అనుకున్నా. కానీ ఈ పిచ్‌పై స్కోరు చేయడం చాలా కష్టం. మా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత టీంతో అదే చెప్పా' అన్నాడు.

'ఎర్లీగా రెండు, మూడు వికెట్లు తీస్తే లక్నో తేరుకోవడం కష్టమని మా బౌలర్లకు చెప్పా. కర్ణ్ చాలా కష్టపడతాడు. కానీ అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. చిన్నస్వామిలో లెగ్ స్పిన్నర్లు ఆడటం చాలా కష్టం కదా. అలాగే జోష్ హాజిల్‌వుడ్ అనుభవం చేరడంతో మా పేస్ బౌలింగ్ యూనిట్‌లో ఒక కామ్‌నెస్, కంపోజర్ వచ్చాయి' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, May 2, 2023, 8:16 [IST]
Other articles published on May 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+