Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : అనుష్క శర్మ బర్త్ డే.. ఎమోషనల్ పోస్టుతో విషెస్ చెప్పిన కోహ్లీ!

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె ఇప్పటి వరకు బయట పెట్టని కొన్ని ఫొటోలను కోహ్లీ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీటితోపాటు తన ప్రియమైన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అనుష్క శర్మ తన 35వ పడిలో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు షేర్ చేసిన కోహ్లీ.. 'అన్ని కష్టాలు, సుఖాలు, నీ క్యూట్ పిచ్చినతనం అన్నింటిలో నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నా అన్నీ అయిన నీకు హ్యాపీ బర్త్ డే' అని పోస్టు పెట్టాడు. వీళ్లిద్దరూ 2017 డిసెంబరులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

 kohlianushka

కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అనుష్క అతనికి చాలా మద్దతుగా నిలిచింది. ఈ విషయాన్ని కోహ్లీ పలు సందర్భాల్లో బయటపెట్టాడు. అతను టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికినప్పుడు అనుష్క ఎమోషన్ పోస్టు కూడా పెట్టింది. అది కూడా చాలా వైరల్ అయింది. ఇటీవల కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్న తర్వాత తను బాదిన సెంచరీలను సెలబ్రేట్ చేసుకునే సమయంలో తమ పెళ్లి ఉంగరాన్ని ముద్దాడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్‌లో కోహ్లీ బిజీగా ఉన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను ఇప్పటికే ఐదు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఆడే దాదాపు అన్ని మ్యాచులకు హాజరవుతున్న అనుష్క.. తన భర్త ఆడుతున్న ఫ్రాంచైజీకి మద్దతు తెలుపుతోంది. ఇటీవల గ్రీన్ డ్రెస్‌లో ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన అనంతరం.. కోహ్లీ ఆమెకు గాల్లో ముద్దులు పంపిన ఫొటోలు కూడా తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, May 1, 2023, 15:42 [IST]
Other articles published on May 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+