ఈ ఏడాది ఐపీఎల్‌లో మంచి సమతూకంతో ఉన్నట్లుగా కనిపిస్తున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ప్రారంభం అవడానికి ముందు నుంచే ఈ టీం చాలా బలంగా కనిపిస్తోందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. తొలి మ్యాచ్‌లో ముంబైని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. ఆ అంచనాలను అందుకున్నట్లే కనిపించింది. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడి తమ పాత పంథా చూపించింది.
దీంతో ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' టీం కూడా ఆర్సీబీకి విషెస్ పంపింది. 'అత్యంత క్రూరమైన మగాడు మీ మైండ్ బ్లో చేసేయడానికి 2023 సెప్టెంబర్ 28న వచ్చేస్తున్నాడు' అని ట్వీట్ చేసిన సలార్ టీం.. 'హలో ఆర్సీబీ.. ఈ ఏడాది రెబల్ మోడ్‌ను అన్‌లీష్ చేద్దాం' అని పేర్కొంది. సలార్‌ను తెరకెక్కిస్తున్న హోంబళే ఫిలింస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరూ కర్ణాటకకు చెందిన వారే అని తెలిసిందే.

అందుకే తమ జట్టు ఆర్సీబీకి సపోర్ట్‌గా ట్వీట్ చేసింది ఈ మూవీ టీం. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా మంచి ఖుషీ ఫీల్ అవుతున్నారు. ఈ ఏడాది ఎలాగైనా ఆర్సీబీ కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎంత హైప్ ఉందో తెలిసిందే. మరి అలాంటి మూవీ టీం కూడా ఆర్సీబీ కోసం ట్వీట్ చేస్తే.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఈ ట్వీట్‌ను తెగ వైరల్ చేసేస్తున్నారు.
కాగా, కొన్ని రోజుల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు కూడా ఇలాగే మూవీ టీం నుంచి విషెస్ అందాయి. తెలుగులో బంపర్ హిట్‌గా నిలిచిన 'దసరా' టీం ఈ మూవీ టీం.. వరుసగా రెండు మ్యాచులు ఓడిన సన్‌రైజర్స్ టీంకు మంచి ఆఫర్ ఇచ్చింది. ఈ చిత్రంలో నాని కేరక్టర్ ధరణి కూడా క్రికెట్ ఆడతాడు. ఇదే విషయం చెప్పిన మూవీ టీం.. తమ ధరణిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంటారా? అని సన్‌రైజర్స్‌కు ఆఫర్ ఇచ్చింది. ఈ ట్వీట్ కూడా తెగ వైరల్ అయింది.