Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsLSG : అతనికిదేం కొత్త కాదు.. లెజెండ్స్ అందరితో గొడవలే!

లక్నో, ఆర్సీబీ మ్యాచ్ కన్నా కూడా దాని తర్వాత జరిగిన గొడవే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివాన అన్నట్లు పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలోనే లక్నో కోచ్ గౌతం గంభీర్, కోహ్లీ పూర్తి మ్యాచ్ ఫీజును ఫైన్ వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ గొడవకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. కొంత మంది కోహ్లీ చేసిన కరెక్ట్ కాదని, నవీన్ వంటి జూనియర్‌తో కోహ్లీ ప్రవర్తన ఏం బాగలేదని అంటున్నారు. అలాగే సీనియర్లు అయిన మిశ్రా, గంభీర్‌తో కూడా కోహ్లీ బ్యాడ్‌గా బిహేవ్ చేశాడని అంటున్నారు.

Naveen Ul Haq fought with many legends across leagues

అయితే అసలు ఈ గొడవకు కారణమైన నవీన్ ఉల్ హక్ హిస్టరీ చూస్తే మైదానంలో ఏం జరిగిందో అనే అనుమానం రాక మానదు. కొంతకాలం క్రితం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా నవీన్ ఆడాడు. అప్పటికి అతను ఇంత సీనియర్ కూడా కాదు. అప్పుడే పాక్ లెజెండ్ షాహిద్ అఫ్రిదీతో గొడవకు దిగాడు.

అఫ్రిదీని పాకిస్తాన్‌లో ఎంత గొప్ప క్రికెటర్‌గా భావిస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తితో నవీన్ గొడవకు దిగాడు. వాళ్లిద్దర్నీ ఆపడానికి రెండు జట్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో లీగ్‌లో శ్రీలంక సీనియర్ ప్లేయర్ థిసార పెరీరాతో కూడా నవీన్ గొడవ పడ్డాడు. అతను పరుగు తీస్తుండగా కావాలని అడ్డు వెళ్లి మరీ గొడవకు దిగాడు.

ఇలా తను ఆడిన ప్రతి లీగ్‌లోనూ అనుభవం ఉన్న ప్లేయర్లు, లెజెండ్లతో నవీన్ ఉట్టి పుణ్యానికే గొడవలు పడ్డాడు. వీటికి సంబంధించిన వీడియోలు, వార్తలు కూడా నెట్టింట చాలానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్‌లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అతను.. ఇలా సీనియర్లతో గొడవకు దిగడం ఏంటని ఇంతకు ముందే చాలా మంది నవీన్‌ను విమర్శించారు.

ఇప్పుడు ఇండియాకు వచ్చిన నవీన్.. విరాట్ కోహ్లీతో గొడవకు దిగాడు. అసలే ఎగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ వెనక్కు తగ్గలేదు. ఆ కోపంలో ఏమన్నాడనేది ఎవరికీ తెలీదు. ఇలాంటి సమయంలో సర్ది చెప్పాల్సిన గౌతమ్ గంభీర్.. తన ప్లేయర్లను కాపాడుకోవడానికి తను కూడా ఎగ్రెషన్ చూపించాడు. గంభీర్ యాటిడ్యూడ్ కూడా అలాంటిదే. దీనిలో తప్పు పట్టడానికి ఏం లేదు. ఒకరి ప్రవర్తన ఇలా ఉండాలి అని ఎవరూ రూల్స్ పెట్టలేరు.

కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే మంచిది. ఈ గొడవ చివర్లో కేఎల్ రాహుల్ అదే పని చేయబోయాడు. నవీన్, కోహ్లీ మధ్య సంధి చేయడానికి ప్రయత్నించాడు. కానీ నవీన్ ససేమిరా అంటూ వెనక్కు వెళ్లిపోయాడు. అసలు ఏం జరిగిందో కూడా కనీసం తెలియకుండా.. ఆటగాళ్లను సోషల్ మీడియాలో నిందించడం ఎంత వరకు న్యాయం? అనేది అసలు ప్రశ్న.

Story first published: Tuesday, May 2, 2023, 14:55 [IST]
Other articles published on May 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+