Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsKKR : సూపర్ ఫామ్‌లో ఆర్సీబీ.. తడబడుతున్న కేకేఆర్.. మ్యాచ్‌లో గెలిచేదెవరు?

ఐపీఎల్ 2023లో మరో ఉత్కంఠ పోరుకు అంతా సిద్ధం అయింది. మంచి ఫామ్‌లో కనిపిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఢీకొట్టనుంది. తమ సొంత మైదానంలో ఈ మ్యాచ్ ఆడుతున్నా కూడా కేకేఆర్‌కు తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే ఆ జట్టులో ప్రధాన ప్లేయర్లు ఎవరూ అంత గొప్ప ఫామ్‌లో లేరు. అదే సమయంలో ఆర్సీబీ కీలక ప్లేయర్లు మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు.

ఆర్సీబీ ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న మ్యాక్స్‌వెల్ కూడా ముంబైపై రెండు భారీ సిక్సులు బాదాడు. అలాగే ఈడెన్ గార్డెన్స్‌లో ఆడేందుకు దినేష్ కార్తీక్ కూడా ఇష్టపడతాడు. అదే సమయంలో ఆర్సీబీకి కూడా కొన్ని తలనొప్పులు ఉన్నాయి. సిరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా కూడా.. మరో ఎండ్‌లో సరైన బౌలర్ లేడు. రీస్ టాప్లే గాయపడటంతో ఆ జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది.

RCBvsKKR Who will win Today IPL match

అయితే టాప్లే స్థానంలో డేవిడ్ విల్లే ఆడే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో హసరంగ, హాజిల్‌వుడ్, టాప్లే లేకపోయినా కూడా ఆర్సీబీ బౌలింగ్ ఫర్వాలేదనిపిస్తోంది. అదే సమయంలో కేకేఆర్ టాపార్డర్ అంత విధ్వంసకరంగా లేదు. రహ్మనుల్లా గుర్బాజ్, మన్‌దీప్ సింగ్ ఇద్దరూ మొదటి మ్యాచులో పెద్దగా రాణించలేదు. మిడిలార్డర్ కూడా అంత బలంగా కనిపించడం లేదు. చివర్లో రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ రాణించకపోతే ఆ జట్టు మరింత బలహీనం అయిపోతుంది.

ఇక బౌలింగ్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ పూర్తిగా తేలిపోయాడు. బెంగళూరు బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడానికి తడబడతారని పేరు. దీన్ని క్యాష్ చేసుకోవాలంటే నరైన్ రాణించకతప్పదు. అలాగే టిమ్ సౌథీ కూడా తన లైన్ అండ్ లెంగ్త్‌ను సరిగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం కుదురుతుంది.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా కనుక టాస్ గెలిస్తే.. ఆ టీంకు కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అది జరగాలన్నా సరే ఆండ్రీ రస్సెల్ రాణించక తప్పదు. లేదంటే ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలిచి రెండు పాయింట్లను తమ ఖాతాలో వేసుకోవడం గ్యారంటీ. ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తున్న ఆర్సీబీని మరే జట్టయినా ఓడిస్తుందా? అనేది కూడా అనుమానమే అని కొందరు నిపుణులు అంటున్నారు.

Story first published: Thursday, April 6, 2023, 16:21 [IST]
Other articles published on Apr 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+