Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsKKR : కెప్టెన్సీ వదిలేయడం కోహ్లీకి కలిసొచ్చింది: డివిలియర్స్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ ఐపీఎల్‌లో తన వింటేజ్ బెస్ట్‌ ఆటతీరు కనబరచాలని తహతహలాడుతున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గ్లింప్స్ కనిపించాయి కూడా. ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా చాలా ఖుషీ అయిపోయారు.

ఆర్సీబీ మాజీ టీంమేట్, సఫారీ సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లీ బ్యాటింగ్‌కు ఫిదా అయిపోయాడు. ఇప్పుడు కోహ్లీ మైదానంలో లేకపోతే మిగతా సమయంలో ఎక్కువ శాతం తన స్నేహితులు, కుటుంబంతో గడుపుతున్నాడని చెప్పాడు. అందుకే కోహ్లీ తన బెస్ట్ ఆటను బయటకు తీసుకురాగలిగాడని మెచ్చుకున్నాడు. గత సీజన్‌లో కెప్టెన్సీ వదిలేయడం కోహ్లీకి బాగా కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు.

Virat Kohli relaxed

'కోహ్లీ రిలాక్స్ అవడంలో గతేడాది కెప్టెన్సీ వదిలేయడం చాలా కీ రోల్ పోషించిందని నేను అనుకుంటున్నా. అతను ఒక ఫెంటాస్టిక్ కెప్టెన్. కానీ అతను మరీ ఎక్కువ కాలం ఈ పాత్ర కొనసాగించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా ఉండటం అతని ఆటపై ప్రభావం చూపించింది' అని డివిలియర్స్ వివరించాడు. కుటుంబంతో, స్నేహితులతో సమయం గడిపే అవకాశం అతనికి ఉండేది కాదన్నాడు.

'ఇలా కెప్టెన్‌గా ఉంటే కుటుంబంతో సేద తీరడం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం మన వల్ల కాదు. మైదానంలో ఆటను ఎంజాయ్ చేయడం, సరదాగా గడపం, నవ్వుతూ ఉండటం.. ఈ సీజన్‌లో ఇదే కోహ్లీ మంత్ర అని అనుకుంటున్నా' అని డివిలియర్స్ చెప్పాడు. ఈ ఐపీఎల్‌లో కోహ్లీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఆటలో పెద్దగా మార్పులేవీ కనిపించడం లేదని చెప్పాడు.

'కోహ్లీ ఆటతీరు ఎప్పట్లాగే ఉంది. అతని టెక్నిక్ సాలిడ్‌గా కనిపిస్తోంది. క్రీజులో ఉన్నప్పుడు మంచి బ్యాలెన్స్‌‌తో ఉన్నాడు. తను ఇప్పటికీ వికెట్ల దగ్గర ఫుల్ ఎనర్జీతో కనిపించే బిజీ ప్లేయరే. కాకపోతే ఈ సీజన్‌లో చాలా ఫ్రెష్‌గా వచ్చనట్లు అనిపిస్తోంది. ఇటీవల ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఇంతకుముందు కన్నా ఎక్కువగా నవ్వుతూ కనిపిస్తున్నాడు' అని డివిలియర్స్ తన అభిప్రాయం బయటపెట్టాడు. ఏదేమైనా కోహ్లీ ఇదే ఫామ్‌ను వన్డే వరల్డ్ కప్‌లో కూడా కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Thursday, April 6, 2023, 16:00 [IST]
Other articles published on Apr 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+