Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsGT : అంత బాధలోనూ గిల్‌ను మెచ్చుకున్న కోహ్లీ.. ఫొటోలు వైరల్!

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మంచి స్కోరు చేసింది. కానీ ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పెద్దగా రాణించకపోవడం ఆర్సీబీని దెబ్బతీసింది. కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా ఎవరూ సరిగా ఆడలేదు.

ఈ క్రమంలో ఆర్సీబీ 197 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. ఛేజింగ్‌లో గుజరాత్‌ను శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్) ముందుండి నడిపించాడు. కోహ్లీ వరుస మ్యాచుల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదితే.. తను కూడా తక్కువ కాదన్నట్లు వరుసగా రెండో మ్యాచులో సెంచరీ బాదాడు. అతని వికెట్ తీసుకొని ఉంటే తాము గెలిచే వాళ్లమని డుప్లెసిస్ కూడా మ్యాచ్ అనంతరం చెప్పాడు.

Virat Kohli appreciates Shubman Gill

అంత అద్భుతంగా గిల్ ఆడటంపై క్రికెట్ నిపుణులు, మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్ చివరి ఓవర్లకు వచ్చే సరికి ఆర్సీబీ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలోనే మైదానం వీడిన కోహ్లీ.. తన మొఖాన్ని టోపీతో కప్పుకొని చాలా బాధ పడుతూ కనిపించాడు. అతనితోపాటు సిరాజ్ తదితరులు కూడా చాలా బాధగా కనిపించారు. ఇంత బాధలో కూడా కోహ్లీ చేసిన పని వైరల్ అవుతోంది.

మ్యాచ్ ముగిసే సమయంలో చాలా బాధగా కనిపించిన కోహ్లీ.. మ్యాచ్ ముగియగానే మైదానంలోకి వచ్చి గుజరాత్ జట్టు సభ్యులను అభినందించాడు. ఈ క్రమంలో సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్‌ను కౌగిలించుకొని మరీ కంగ్రాట్స్ చెప్పాడు. భారత క్రికెట్‌కు అతని ఫామ్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నందు వల్లనే కోహ్లీ ఇలా చేసినట్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గిల్ ట్యాలెంట్‌ను కోహ్లీ మెచ్చుకుంటున్న ఫొటోలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Story first published: Monday, May 22, 2023, 11:03 [IST]
Other articles published on May 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+