Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsGT : భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలతాడు.. గిల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్!

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మంచి స్కోరు చేసింది. కానీ ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పెద్దగా రాణించకపోవడం ఆర్సీబీని దెబ్బతీసింది. కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా ఎవరూ సరిగా ఆడలేదు.

ఈ క్రమంలో ఆర్సీబీ 197 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. ఛేజింగ్‌లో గుజరాత్‌ను శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్) ముందుండి నడిపించాడు. కోహ్లీ వరుస మ్యాచుల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదితే.. తను కూడా తక్కువ కాదన్నట్లు వరుసగా రెండో మ్యాచులో సెంచరీ బాదాడు. అతని వికెట్ తీసుకొని ఉంటే తాము గెలిచే వాళ్లమని డుప్లెసిస్ కూడా మ్యాచ్ అనంతరం చెప్పాడు.

Shubman Gill

అంత అద్భుతంగా గిల్ ఆడటంపై క్రికెట్ నిపుణులు, మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా దీనిపై స్పందిస్తూ.. 'కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కానీ అతనికి మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు. అదే సమయంలో గిల్ సూపర్‌గా ఆడాడు' అని మెచ్చుకున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ కూడా భారత క్రికెట్ ప్రిన్స్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ప్రపంచ క్రికెట్‌లో ఈ తరాన్ని విరాట్ కోహ్లీ ఏలుతున్నట్లే వచ్చే తరాన్ని గిల్ ఏలుతాడని జోస్యం చెప్తున్నారు. టీమిండియా భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంటుందని అంటున్నారు. ఈ మ్యాచ్‌‌లో ఆరంభం నుంచే గిల్ చాలా కమాండింగ్‌గా ఆడాడు. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. జట్టును లక్ష్యం దిశగా నడిపాడు.

అతనికి విజయ్ శంకర్ (53) నుంచి మంచి సహకారం దొరికింది. వీళ్లిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అదే సమయంలో కీలక సమయంలో ఆర్సీబీ బౌలర్లు తడబడ్డారు. దీంతో గుజరాత్ విజయం సాధించింది. తమ జట్టు అద్భుతంగా రాణించినా కూడా ప్లేఆఫ్స్ చేరుకోలేకపోవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు.

Story first published: Monday, May 22, 2023, 10:07 [IST]
Other articles published on May 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+