ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరాలనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలకు వాన దేవుడు గండి కొట్టేలా ఉన్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ మొదలవడానికి ముందే బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి.
మధ్యాహ్నం 3 గంటల వరకు వాతావరణం బాగానే ఉందని, అయితే అప్పటి నుంచి వాతావరణ సడెన్‌గా మారిపోయి భారీ వర్షం పడుతోందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వడగండ్లు కూడా పడటం గమనార్హం. ఈ వర్షం ఇలాగే సాగితే ఆర్సీబీ, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగడం చాలా కష్టంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్ కనుక వర్షం కారణంగా రద్దయితే.. సన్‌రైజర్స్‌పై ముంబై గెలిస్తే చాలు. ఆ జట్టే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఒక వేళ సన్‌రైజర్స్ గెలిస్తే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఈసారి కూడా ఆర్సీబీకి నిరాశ తప్పదు. సన్‌రైజర్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాణించాలని అనుకుంటున్నట్లు ఆ టీం కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెప్పాడు.
అయితే వాంఖడే వేదికగా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ స్టేడియంలో ముంబైని ఓడించడం అంత ఈజీ కాదు. ఇక్కడ ముంబై రికార్డు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆ టీం కీలక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ స్టేడియంలో చెలరేగడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలాంటి సమయంలో ముంబై ఓడిపోవడం దాదాపు అసాధ్యం.
ఇలాంటి సమయంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే.. గుజరాత్‌ను ఓడించడం తప్ప మరెటువంటి ఆప్షన్ లేదు. కానీ బెంగళూరులో భారీ వర్షంతో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ కనుక రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు ఆర్సీబీ పాయింట్ల సంఖ్య 15కు చేరుతుంది. సన్‌రైజర్స్‌పై ముంబై గెలిస్తే ఆ జట్టు పాయింట్ల సంఖ్య 16కు చేరుతుంది. దీంతో ఆ టీం నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.