Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsDC : ఢిల్లీతో మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ కీలక నిర్ణయం.. జట్టులోకి కేదార్ జాదవ్!

ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలకమైన మ్యాచ్ కోసం ఆర్సీబీ రెడీ అయింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆర్సీబీకి చాలా ముఖ్యం. ప్లేఆఫ్స్ రేసులో ఈ టీం నిలవాలంటే కచ్చితంగా గెలవాలి. ఇలాంటి పిచ్‌పై ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.

ఈ సీజన్‌లో బెంగళూరు మిడిలార్డర్ చాలా బలహీనంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో మొదటి ముగ్గురిపైనే ఈ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు డుప్లెసిస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వెటరన్ బ్యాటర్ కేదార్ జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు. అతని చేరికతో జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

RCBvsDC :

ఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్ నోకియా ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన డేవిడ్ వార్నర్.. అతని స్థానంలో ముకేష్ కుమార్ ఆడుతున్నట్లు తెలిపాడు. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.

ఇక్కడి పిచ్ చాలా డ్రైగా కనిపిస్తోందని, కాబట్టి భారీ స్కోర్లు నమోదు అవడం చాలా కష్టమని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి బౌలర్లకు పిచ్ నుంచి మంచి సహకారం లభిస్తుందని చెప్తున్నారు. మరి ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ ఏ మాత్రం స్కోరు చేస్తుందో.. దాన్ని ఎంత వరకు కాపాడుకుంటుందో చూడాలి.

ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనూజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, వానిందు హసరంగ, కర్ణ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్

ఢిల్లీ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, రైలీ రూసో, అమన్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

Story first published: Saturday, May 6, 2023, 19:21 [IST]
Other articles published on May 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+