Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsCSK : ఆర్‌సీబీ కొంపముంచిన రహానే సూపర్ ఫీల్డింగ్! (వీడియో)

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. టాపార్డర్‌లో మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ చెలరేగినా కూడా.. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. దీంతో గెలిచేలా కనిపించిన ఆర్సీబీ చివరకు ఓటమి మూటగట్టుకుంది. ఇలా ఆర్సీబీ ఓడిపోవడానికి కారణం కేవలం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యమే కాదు.. చెన్నై సూపర్ ఫీల్డింగ్ కూడా.

ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఫీల్డింగ్ పేలవంగా ఉంది. రెండు, మూడు కీలక క్యాచులను కూడా చెన్నై ఫీల్డర్లు నేలపాలు చేశారు. అయితే వీళ్లందరి కంటే భిన్నంగా తను మాత్రం సూపర్ మ్యాన్‌లా ఫీల్డింగ్ చేశాడు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే. మినీ వేలంలో ఎవరూ కొనకపోతే.. చివరకు బేస్ ధర రూ.50 లక్షలకే అతన్ని చెన్నై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Rahane super fielding won it for CSK

ఈ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొట్టిన ఒక భారీ షాట్ కచ్చితంగా సిక్సర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రహానే మాత్రం దాన్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే గాల్లోకి ఎగిరి మరీ ఆ బంతిని క్యాచ్ పట్టేశాడు. అయితే దాన్ని చేతిలో ఉంచుకుంటే సిక్స్ అవుతుందని అతనికి కూడా తెలుసు. అందుకే తను బౌండరీ రోప్ మీద పడే ముందే.. బంతిని మైదానంలోకి విసిరాడు.

దీంతో సిక్సర్ వెళ్లాల్సిన ఆ బంతికి కేవలం సింగిల్ వచ్చింది. అలాగే ఆ తర్వాత కూడా సూపర్ ఫీల్డింగ్‌తో రెండు, మూడు బౌండరీలను రహానే అడ్డుకున్నాడు. అతని ఫీల్డింగ్ చూసిన మిగతా చెన్నై ఫీల్డర్లు కూడా తమ పొరపాట్లు సరిచేసుకొని చక్కగా ఫీల్డింగ్ చేయడం మొదలు పెట్టారు. దీనికితోడు ధోనీ తనదైన స్టైల్‌లో వ్యూహాలు రచించి మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ఇద్దర్నీ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో ఆర్సీబీ ఓటమిపాలైంది.

Story first published: Tuesday, April 18, 2023, 8:00 [IST]
Other articles published on Apr 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+