Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ విజేతగా నిలిచేది ఆ జట్టే.. కానీ! - మాజీ క్రికెటర్

ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఇక మిగిలిన బెర్త్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. శనివారం ఇరు జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే గెలిస్తే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

మరోవైపు ఆర్సీబీ తుదిపరి దశకు చేరుకోవాలంటే నెట్‌రన్‌రేటు చాలా కీలకం. సీఎస్కే తొలుత ఓ 200 పరుగులు చేసిందనకుంటే దాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలుండగానే ఛేదించాలి. లేదా ఆర్సీబీనే మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

RCB s Momentum Could Threaten Other Playoff Teams- Irfan Pathan

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఆర్సీబీకి నిరాశే. సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో ప్లేఆఫ్స్ రేసు ముగుస్తుంది. అయితే బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ చేరితే కప్ ఎగరేసుకునిపోతుందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వరుస విజయాలతో హోరెత్తిస్తున్న ఆర్సీబీ తదుపరి దశకు చేరితే, మిగిలిన జట్లకు ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నాడు. రేపటి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని తెలిపాడు.

''రేపటి పోరులో గెలవడం ఇరు జట్లకు అంత సులువు కాదు. కానీ ఆర్సీబీ మంచి ఊపు మీదుంది. అదే జోరులో సీఎస్కేపై నెగ్గి బెంగళూరు తుదిపరి దశకు చేరితే, ప్లేఆఫ్స్‌కు వెళ్లిన మిగిలిన మూడు జట్లకు ఇది ఎంతో ప్రమాదకరం. ప్రస్తుతం ఆర్సీబీ కంటే డేంజర్ టీమ్ ఏదీ లేదు. అయితే కీలక మ్యాచ్‌ల్లో ఎలా సత్తాచాటాలో చెన్నైకి బాగా తెలుసు''

''అయితే ప్రస్తుతం సీఎస్కే జట్టు ఇబ్బందుల్లో ఉంది. ఆటగాళ్ల గాయాల సమస్యలు, కొత్త కెప్టెన్, ధోనీ నాయకత్వం వహించకపోవడం ప్రతికూలతలు. అప్పుడప్పుడు ధోనీ ఫీల్డింగ్ సెట్ చేస్తుండటం మనం చూశాం. కానీ అతను కెప్టెన్ కాదు. గతంలో జడేజా సారథి ఉన్నప్పుడు ఇదే పరిస్థితి చూశాం. చెన్నై మెరుగైన ప్రదర్శన చేయలేకోయింది. అయితే రేపటి మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు వెళ్లాలని సీఎస్కే అభిమానులు ఆశిస్తున్నారు'' అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

Story first published: Friday, May 17, 2024, 11:01 [IST]
Other articles published on May 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+