For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dwane Bravo రికార్డుకు ఎసరు: హయ్యెస్ట్ వికెట్ టేకర్‌ రికార్డుకు చేరువలో హ్యాట్రిక్ వీరుడు

RCB’s Harshal Patel just 6 wickets away from all time IPL record as highest wicket taker in a season

అబుధాబి: హర్షల్ పటేల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ బ్రహ్మాస్త్రం. ఇదివరకు ఎప్పుడు పెద్దగా ఐపీఎల్ సీజన్లలో వెలుగులోకి రాలేదతను. ఏ ముహూర్తంలో కోహ్లీ టీమ్‌లో జాయిన్ అయ్యాడో గానీ.. అతని జాతకమే మారిపోయింది. వికెట్ల తుఫాన్‌ను సృష్టిస్తున్నాడు. హ్యాట్రిక్ వికెట్లకు కేరాఫ్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టాడు. మరో రికార్డుకు చేరువ అవుతున్నాడీ హర్యానా స్పీడ్ స్టర్.

హయ్యెస్ట్‌ వికెట్ టేకర్‌గా కంటిన్యూ అవుతున్నాడు హర్షల్ పటేల్. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అతను 11 మ్యాచులను ఆడాడు. ఏకంగా 26 వికెట్లను పడగొట్టాడు. అతని బెస్ట్ ఫిగర్ 5/27. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో మూడు వరుస బంతుల్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లను బలి తీసుకున్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై నిప్పుల్లాంటి బంతులను సంధించాడు. హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రోహిత్ సేన.. హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌ను ఎదుర్కొనడానికి ఆపసోపాలు పడింది. 3.1 ఒక్క ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు హర్షల్ పటేల్. ఈ మ్యాచ్‌లో హర్దిక్ పాండ్యా, కీరన్ పొల్లార్డ్, రాహుల్ చాహర్‌లను పెవిలియన్ దారి పట్టించాడు. యజువేంద్ర చాహల్-3, గ్లెన్ మ్యాక్స్‌వెల్-2 వికెట్లను తీసుకున్నారు అదే మ్యాచ్‌లో. మ్యాచ్ మ్యాచ్‌కు అతని బౌలింగ్ పదును పెరుగుతోంది.

11 మ్యాచుల్లో 26 వికెట్లను పడగొట్టిన హర్షల్ పటేల్.. ఓ అరుదైన రికార్డుకు చేరువ అయ్యాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న మొనగాడిగా ఆవిర్భవించడానికి సిద్ధం అయ్యాడు. దీనికోసం అతను చేయాల్సిందల్లా మరో ఆరు వికెట్లను పడగొట్టడమే. ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న రికార్డు ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావో పేరు మీద ఉంది.
2013 సీజన్‌లో బ్రావో ఈ రికార్డును నెలకొల్పాడు. 18 మ్యాచులను ఆడిన అతను 32 వికెట్లు తీసుకున్నాడు. ఆ సీజన్‌లో అతని బెస్ట్ 4/42.

హర్షల్ పటేల్ ఈ రికార్డుకు సమీపించాడు. ఆరు వికెట్ల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం 11 మ్యాచుల్లో 26 వికెట్లను తీసుకున్నాడు. లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్లే ఆఫ్ రేసు కూడా దాదాపు ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నందున అక్కడ ఆడే మ్యాచులు అదనం. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెళ్లడమంటూ జరిగితే- హర్షల్ పటేల్‌కు ఈ ఆరు వికెట్లను పడగొట్టడం అనేది లాంఛనప్రాయమే కావచ్చు.

Story first published: Thursday, September 30, 2021, 15:11 [IST]
Other articles published on Sep 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+