Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ మార్క్ చూపించలేకపోయాడు.. 13పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం

RCB won the match with 13 runs against chennai super kings

ఐపీఎల్ 2022సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 173పరుగులు చేసి 174పరుగుల టార్గెట్‌ను చెన్నైకి విధించింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 8వికెట్లు కోల్పోయి 160పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 13పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలయింది.

శుభారంభం దక్కినా..

శుభారంభం దక్కినా..

ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం వచ్చింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (28పరుగులు 23బంతుల్లో), డెవాన్ కాన్వే (56పరుగులు 37బంతుల్లో 6ఫోర్లు 2సిక్సర్లు) ధాటిగా ప్రారంభించారు. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 5ఓవర్లు ముగిసేసరికి స్కోరుబోర్డు 50పరుగులు దాటింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 54పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత ఉతప్ప (2), అంబటి రాయుడు (10) ఇద్దరినీ మ్యాక్స్ వెల్ ఔట్ చేయడంతో చెన్నైకి గట్టి దెబ్బ పడింది. ఇక ఆ తర్వాత డెవాన్ కాన్వే ఒంటరిగా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడినా.. మరో ఎండ్‌లో సరైన సపోర్ట్ దొరకలేదు. కాసేపు మోయిన్ అలీ (34పరుగులు 27బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) చెన్నై శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే అతన్ని హర్షల్ పటేల్ బుట్టలో వేశాడు. జడేజా (3), ఎంఎస్ ధోనీ (2) నిరాశపరిచారు. దీంతో రిక్వైడ్ రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. ఇక చివరి ఓవర్లో 30పరుగులు కావాల్సిన పరిస్థితి నెలకొనగా.. హర్షల్ 17పరుగులు ఇచ్చి 2వికెట్లు తీయడంతో చెన్నై 13పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ (3)వికెట్లు తీసి చెన్నైను భారీ దెబ్బ తీయగా.. మ్యాక్సీ (2), హసరంగ, హజిల్ వుడ్, షాబాజ్ అహ్మద్ తలా ఒక వికెట్ తీసి చెన్నై పతనాన్ని శాసించారు.

అంతకుముందు రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు

అంతకుముందు రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు

తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో డుప్లెసిస్ (22బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్‌తో 38పరుగులు), కోహ్లీ (33బంతుల్లో 30పరుగులు), మహిపాల్ లోమ్రోర్ (27బంతుల్లో 42పరుగులు), రజత్ పాటిదర్ (21పరుగులు), దినేశ్ కార్తీక్ (26పరుగులు 17బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. దీంతో ఆర్సీబీ 8వికెట్లు కోల్పోయి 173పరుగులు చేసింది.

పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అవార్డులు

పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అవార్డులు

పంచ్ సూపర్ స్ట్రైకర్ - ఫాఫ్ డుప్లెసిస్

గేమ్ ఛేంజర్ - మోయిన్ అలీ

లెట్స్ క్రాకింగ్ సిక్సెస్ - మోయిన్ అలీ

పవర్ ప్లేయర్ - ఫాఫ్ డుప్లెసిస్

మోస్ట్ వాల్యుబుల్ అసెట్ - మహిపాల్ లోమ్రోర్

ఫాస్టెస్ట్ డెలివరీ - మహ్మాద్ సిరాజ్

ఆన్ ధి గో ఫోర్స్ - డెవాన్ కాన్వే

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ - హర్షల్ పటేల్ (3-35)

తుది జట్లు :

తుది జట్లు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ

Story first published: Wednesday, May 4, 2022, 23:34 [IST]
Other articles published on May 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+