RCB vs RR Toss: ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రెండు జట్లు తమ గత మ్యాచ్ లలో ఓటమిని చవిచూశాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఆకుపచ్చ జెర్సీలో బరిలోకి దిగింది. ఈ జట్టు ఇలా చేయడం ద్వారా పరిశుభ్రమైన, ఆకుపచ్చ వాతావరణాన్ని ప్రోత్సహిస్తోంది.
తుది జట్లు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.

రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డు
ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్, బెంగళూరు మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ ఇరు జట్ల మధ్య 32 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో ఆర్సీబీ 15 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇది కాకుండా 3 మ్యాచ్ లు అసంపూర్తిగా నిలిచాయి. ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
వాతావరణం ఇలా..
రాజస్థాన్, బెంగళూరు మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లో జరుగుతోంది, ఈ సీజన్‌లో ఈ నగరంలో ఇది మొదటి మ్యాచ్. జైపూర్ వాతావరణం గురించి చెప్పాలంటే, ఈరోజు ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. అయితే, మ్యాచ్ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత గురించి మాట్లాడుకుంటే, జైపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా.