Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : విన్నింగ్ టీంను కంటిన్యూ చేస్తున్న ఆర్సీబీ.. ఈసారి ట్రోఫీ పక్కానా?

RCB will win the trophy in IPL 2023 know why

క్రికెట్ పండుగ ఐపీఎల్ 2023 దగ్గర పడే కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది. థ్రిల్లింగ్ మ్యాచులతో అభిమానులను ఉర్రూతలూగించే ఈ లీగ్‌లో చాలా జట్లు ట్రోఫీ నెగ్గి సత్తా చాటాయి. అదే సమయంలో టైటిల్ నెగ్గకపోయినా ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ వంటి జట్లకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆర్సీబీ ఎంత బలంగా ఉన్నా దురదృష్టంతో ట్రోఫీకి దూరమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఈ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ఆర్సీబీ కప్పు కొట్టేలాగే ఉంది. దానికి కారణాలేంటంటే..

విరాట్ కోహ్లీ ఫామ్..

విరాట్ కోహ్లీ ఫామ్..

గత మూడేళ్లుగా సరైన ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ ఇప్పుడు మళ్లీ గాడిలో పడ్డాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అతను ఎంత బాగా ఆడగలడో టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి రుజువైంది. ఇలాంటి ఫామ్‌లో ఉన్న కోహ్లీ బ్యాటింగ్ లైనప్‌లో ఉండటం ఆర్సీబీకి కచ్చితంగా బలమనే చెప్పాలి. కోహ్లీ ఫామ్‌లో ఉంటే ఒక జట్టు బ్యాటింగ్ భారం మొత్తం తనే మోయగల సమర్ధుడు. ముఖ్యంగా గతేడాది అడపా దడపా కోహ్లీ ఆడినా కూడా.. అన్‌లక్కీగా అవుటవడం, షాట్ సెలెక్షన్ తప్పిదాలతో అతని ఆటతీరు మసకబారింది. దీంతో డుప్లెసిస్, దినేష్ కార్తీక్ వంటి వాళ్లపై భారం పెరిగింది. ఈసారి ఈ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. కోహ్లీతోపాటు డుప్లెసిస్, పటీదార్, డీకే వంటి వాళ్లు ఫామ్‌లో ఉండటంతో జట్టు బ్యాటింగ్ మరింత బలంగా కనిపిస్తోంది.

బలంగా బౌలింగ్ యూనిట్..

బలంగా బౌలింగ్ యూనిట్..

మెగా వేలం తర్వాత ఆర్సీబీ జట్టు తమ బౌలింగ్ యూనిట్‌ను బలంగా తయారు చేసుకుంది. ఆల్‌రౌండర్లు, క్వాలిటీ బౌలర్లతో జట్టులో సమతుల్యత తీసుకొచ్చింది. గతేడాది వానిందు హసరంగ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. అలాగే గత సీజన్‌లో సిరాజ్ ఫెయిలవడం కూడా ఆ జట్టును దెబ్బతీసింది. కానీ ఇప్పుడు సిరాజ్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అవుట్ స్వింగర్, ఇన్‌స్వింగర్లు డెవలప్ చేసుకొని రాణిస్తున్నాడు. అతని ఆటతీరు చూస్తే కచ్చితంగా బెంగళూరు బౌలింగ్‌లో అతను కీలకంగా మారనున్నాడని తెలిసిపోతోంది. అలాగే జోష్ హాజిల్‌వుడ్, రీస్ టాప్లే వంటి వాళ్లతో ఆర్సీబీ బౌలింగ్ బలంగానే కనిపిస్తోంది. హర్షల్ పటేల్ ఫామ్ ఒక్కటే కొంత ఆందోళనకరంగా ఉంది.

విన్నింగ్ కాంబినేషన్..

విన్నింగ్ కాంబినేషన్..

ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేస్తూ టీంలో అస్థిరతను ఆర్సీబీ పెంచలేదు. తమ విన్నింగ్ కాంబినేషన్‌ను నమ్మి, అదే ఆటగాళ్లను జట్టులో కొనసాగించింది. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఎవర్నీ ఈ ఫ్రాంచైజీ వదులుకోలేదు. మినీ వేలంలో ఎన్నో అంచనాలతో కొనుగోలు చేసిన విల్ జాక్స్ జట్టుకు దూరమైనా.. అతని స్థానంలో మైకేల్ బ్రేస్‌వెల్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో ఆర్సీబీ గతేడాదిలాగే తమ బలమైన జట్టుతో బరిలో దిగుతోంది. గత సీజన్‌లో ఆకట్టుకున్న కొత్త మొఖాలు రజత్ పటీదార్ వంటి వాళ్లు మరింత పరిణితితో ఈ సీజన్‌లో అడుగు పెడుతున్న సంగతి కూడా మర్చిపోకూడదు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఆర్సీబీ మంచి బ్యాలెన్స్ ఉన్న జట్టులా కనిపిస్తోంది. ఈ సీజన్‌లోనే జట్టు ట్రోఫీ ముద్దాడినా ఆశ్చర్యం లేదు.

Story first published: Tuesday, March 21, 2023, 8:44 [IST]
Other articles published on Mar 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+