బుల్లెట్ బంతి వేసిన ఎస్‌ఆర్‌హెచ్ యువ పేసర్.. ఐపీఎల్ 2021లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ! స్పీడ్ ఎంతో తెలుసా?

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌లో జమ్మూ కశ్మీర్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు తరఫున ఆడుతున్న ఉమ్రాన్.. యూఏఈ పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తమ బంతులతో హడలెత్తిస్తున్నాడు. 21 ఏళ్ల ఉమ్రాన్ వేసే బంతులకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానమే లేకుండా పోతోంది. పరుగులు చేయడం దేవుడెరుగు కానీ.. అతడి బంతిని ఎదుర్కోవడమే గగనంగా మారుతోంది. అత్యంత వేగవంతమైన బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డుల్లోకి ఎక్కాడు.

ఐపీఎల్ 2021లో అత్యంత వేగవంతమైన బంతి:
బుధవారం అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్.. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు. దీంతో ఐపీఎల్ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా నిలిచాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో భాగంగా తొమ్మిదో ఓవర్ నాలుగో బంతిని ఉమ్రాన్ గంటకు 153 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఆ బంతికి ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ బంతిని పడిక్కల్ డిఫెన్సె ఆడగా.. బ్యాట్ ఎడ్జ్ అవ్వడంతో సింగల్ వచ్చింది. అంతకుముందు విరిసిన బంతిని కూడా ఉమ్రాన్ గంటకు 152 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఆ బంతికి పడిక్కల్ ఆశ్చర్యపోయాడు.

మొదటి బంతే 146 కిలోమీటర్ల వేగం:
ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ఐపీఎల్‌లో ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశాడు. 21 ఏళ్ల ఉమ్రాన్ తన మొదటి బంతినే 146 కిలోమీటర్ల వేగంతో సందించాడు. ఆపై రెండు బంతులను 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. దాంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఇక ఆర్‌సీబీపై గంటకు 153 కిలోమీటర్ల వేగంతో
దూసుకెళ్లే బంతిని విసిరి ఐపీఎల్ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఆడుతున్న ఆర్‌సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ (గంటకు 147.68కిమీ, 147.67కిమీ) రెండో స్థానంలో.. ఎస్‌ఆర్‌హెచ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ (గంటకు 147.38కిమీ) మూడో స్థానంలో ఉన్నాడు.

అన్రిచ్ నోర్జ్ 1:
ఇక ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న నోర్జ్.. ఐపీఎల్ 2020లో గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సందించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే ఫాస్టెస్ట్ బంతిని రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ బౌండరీకి తరలించాడు. నోర్జ్ ఆ తర్వాతి బంతిని కూడా 155.1 గంటకు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అప్పుడు బట్లర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ బంతికి అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో మొదటి మూడు వేగవంతమైన బంతులు (156.2, 155.21, 154.74) నోర్జ్ పేరిటే ఉన్నాయి. డేల్ స్టెయిన్ (154.4 గంటకు కిలోమీటర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్తాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (150) టాప్-5 ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications