For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. కేన్‌కు దక్కని చోటు!!

RCB vs SRH: Sunrisers Hyderabad have won the toss and have opted to field

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌-13వ సీజన్‌లో మరో ఆసక్తికర సమరం మరికొద్ది సేపట్లో ఆరంభంకానుంది. మూడో మ్యాచ్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ బలంగా కనిపిస్తోంది.

ఆదివారం కింగ్స్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మైదానంలోనే ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఆ మ్యాచ్ పరిస్థితులే రిపీట్ కానున్నాయి. స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్. తొలుత బౌలింగ్ అనుకూలిస్తూ.. తర్వాత బ్యాటింగ్‌కు సులువయ్యే పరిస్థితులుంటాయి. ఈరోజు బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా పిచ్ ఉండనుందని సమాచారం. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక గత ఐదు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో రెండు గెలిచాయి. ఒక వర్షంతో రద్దయింది.

ఇప్పటి వరకూ చూసుకుంటే బెంగళూరుపై హైదరాబాద్‌దే పైచేయి. ఈ రెండు జట్ల మధ్య 15 మ్యాచులు జరిగాయి. అందులో హైదరాబాద్‌ 8 మ్యాచుల్లో గెలవగా.. బెంగళూరు ఆరింట్లో గెలుపొందింది. కాగా బెంగళూరుపై డెవిడ్‌ వార్నర్‌ 9 మ్యాచుల్లోనే 562 పరుగులతో మంచి రికార్డు నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ సైతం హైదరాబాద్‌పై 504 పరుగులు చేశాడు. ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక స్కోరు 231.

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (కీపర్), మనీష్ పాండే, విజయ్ శంకర్, మిచెల్ మార్ష్, ప్రియం గార్గ్, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్.

IPL 2020: SRH vs RCB Match Preview, Pitch Report | Warner VS Kohli | Oneindia Telugu

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్.

Story first published: Monday, September 21, 2020, 19:21 [IST]
Other articles published on Sep 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+