Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ.. 100వ విజయంపై కన్ను! ఎస్‌ఆర్‌హెచ్ గెలిచేనా!!

RCB vs SRH Playing 11 is Out: Royal Challengers Bangalore eye in 100th IPL win

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో మరోకొద్దిసేపట్లో ఇంకో ఆసక్తికరమైన పోరు జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ).. పరాజయాల పరంపర కొనసాగిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ సారథి కేన్ విలియమ్సన్ కూడా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ 52వ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది విజయాలతో ఆర్‌సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ ఖరారు చేసుకోగా.. అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తూ ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. ఇక అబుదాబి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైంది. ఇక్కడ మరోసారి బ్యాటర్‌లు చెలరేగే అవకాశం ఉంది. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరించనుంది.

ఈ మ్యాచులో విజయం సాధిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లు సంపాదించవచ్చు. అయితే విజయం సాధించినంత మాత్రాన ఆర్‌సీబీ నంబర్ 3 స్థానంలో ఎటువంటి మార్పు ఉండదు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ వారి ఆత్మగౌరవం కోసం గెలవాలని కోరుకుంటుంది. ఒకవేళ గెలిస్తే పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల సంఖ్య 4 నుంచి 6కి చేరుతుంది. ఐపీఎల్ 2021లో ఈ రెండు జట్లు పోటీ పడటం ఇది రెండో సారి.. గతంలో బెంగళూరు విజయం సాధించింది. అబుదాబిలో కూడా రెండు జట్లు ఈ రోజు రెండోసారి తలపడుతున్నాయి. మొత్తంగా ఐపీఎల్‌లో ఇరు జట్లు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లు గెలవగా, ఆర్‌సీబీ 8 సార్లు గెలిచింది. ఈరోజు ఆర్‌సీబీఒక విజయాన్ని నమోదు చేసుకుంటే.. అది ఐపీఎల్ టోర్నీలో వారి 100వ విజయం అవుతుంది.

తుది జట్టు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రీకర్ భారత్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, డాన్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్.

Story first published: Wednesday, October 6, 2021, 19:14 [IST]
Other articles published on Oct 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+