
పార్టీ స్పాయిలర్ రోల్‌లో
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ టోర్నమెంట్‌లో పార్టీ స్పాయిలర్ రోల్‌ను పోషిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్‌పై ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌లో గెలిచినా ఉపయోగం ఉండదు. అలాగనీ- రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను కూడా పెద్దగా ప్రభావితం చేయబోదు. ఇప్పటికే కోహ్లీసేన ప్లేఆఫ్స్ ఎంట్రీ దాదాపుగా ఖాయమైంది. పైగా ఇంకో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. హైదరాబాద్ చేతిలో ఓడినా దాని బ్యాడ్ ఇంపాక్ట్ ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బ కొట్టలేదు..దూరం చేయనూ లేదు.
ముంబైపై గెలిస్తే మాత్రం..
అదే సన్‌రైజర్స్.. తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే మాత్రం అసలు సిసలు మజా ఉంటుంది. తాను మునగడమే కాకుండా.. ముంబైని కూడా నిండా ముంచినట్టవుతుంది. రోహిత్ సేన ప్లే ఆఫ్ ఆశలు.. అవకాశాలకు గండి కొట్టినట్టవుతుంది. తాను ప్లేఆఫ్స్ నుంచి బయటికి వెళ్లడమే కాకుండా.. పోతూ పోతూ ముంబై ఇండియన్స్‌ను కూడా వెంట బెట్టుకుని మరీ వెళ్తుంది సన్‌రైజర్స్ జట్టు. ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే సన్‌రైజర్స్‌ను ఓడగొట్టి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది రోహిత్ సేన.

మనీష్ పాండే మళ్లీ..
సన్‌రైజర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే మరోసారి డగౌట్‌కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సాయంత్రం అబుధాబిలో జరిగే రాయల్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లోనూ అతను ఆడకపోవచ్చు. టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. జేసన్ రాయ్, వృద్దిమాన్ సాహా ఓపెనర్లుగా కొనసాగుతారు. వన్‌డౌన్‌లో కేన్ విలియమ్సన్, మిడిల్ ఆర్డర్‌లో ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, లోయర్ ఆర్డర్‌లో రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మలిక్ కంటిన్యూ అవుతారు.

నిరాశ పరిచిన మనీష్ పాండే
ఈ టోర్నమెంట్‌లో మనీష్ పాండే నిరాశ పరిచాడు. ఇదివరకట్లా సత్తా చాటలేకపోయాడు. మ్యాచ్‌లను గెలిపించలేకపోయాడు. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లను ఆడిన అతను 223 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ 61 నాటౌట్. రెండు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు షిఫ్ట్ అయిన తరువాత తొలి రెండు మ్యాచుల్లో ఆడాడు గానీ పెద్దగా రాణించలేదు. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్‌లపై విజృంభించలేకపోయాడు. ట్రోల్స్ సైతం ఎదుర్కొన్నాడు. దీనితో అతన్ని పక్కన పెట్టింది మేనేజ్‌మెంట్.

రాయల్ ఛాలెంజర్స్‌లో నో ఛేంజెస్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో మార్పులు ఏవీ ఉండకపోవచ్చు. విన్నింగ్ టీమ్ కావడం వల్ల ఇప్పుడున్న ఆటగాళ్లతోనే లీగ్ దశను ముగించడానికే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. ఇందులో మార్పులు చేయడం వల్ల దాని ప్రభావం ప్లేఆఫ్స్‌పై ఉంటుందనే కోణంలో ఆలోచిస్తోంది. జట్టు చేదు ఫలితాన్ని ఎదుర్కొంటే మాత్రం.. ఎల్లుండి జరిగే చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో మార్పులకు పూనుకోవడానికి అవకాశం ఉంటుంది. తన చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ.. ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టాల్సి ఉంది.

హైదరాబాద్, బెంగళూరు తుదిజట్లు ఇలా ఉండొచ్చు..
సన్‌రైజర్స్ టీమ్‌లో జేసన్ రాయ్, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కేప్టెన్), ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మలిక్ ఉంటారు. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ (కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యజువేందర్ చాహల్ తుది జట్టులో ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












