Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB VS SRH Match 3 :ఆడిన అన్ని తొలి మ్యాచుల్లో హాఫ్ సెంచరీ.. ఎవరీ దేవదత్ పడిక్కల్..?

RCB VS SRH Match 3: Who is Devdutt Padikkal who performed extremely well in debut match?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు డేవిడ్ వార్నర్. ఇక మ్యాచ్ ప్రారంభమైంది. ఓ వైపు సీనియర్ ఆటగాడు ఆరోన్ ఫించ్ నెమ్మదిగా ఆడుతుండగా మరో వైపు దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా ఆడాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. తొలిసారి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఈ 20 ఏళ్ల కుర్రాడు ఎవరా అని అభిమానులు తెగ గూగ్లింగ్ చేసేశారు.

ఎవరీ దేవదత్ పడిక్కల్

ఎవరీ దేవదత్ పడిక్కల్

హైదరాబాదు బౌలర్లపై విరుచుకుపడ్డ దేవదత్ పడిక్కల్ 2000వ సంవత్సరం జూలై 7న కేరళ రాష్ట్రంలోని ఎడప్పల్‌లో జన్మించాడు. 2011లో తన కుటుంబం హైదరాబాదు నుంచి బెంగళూరుకు వలస వెళ్లింది. అక్కడే కర్నాటక ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ క్రికెట్‌లో శిక్షణ పొందాడు. 2014లో తొలిసారిగా కర్నాటక అండర్ -16 మరియు అండర్ -19 మ్యాచ్‌తో ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017లో కర్నాటక ప్రీమియర్ లీగ్‌లో బళ్లారి టస్కర్స్ తరపున ఆడాడు. 2018-19లో కర్నాటక తరపున తొలిసారిగా రంజీ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2019 ఐపీఎల్ టోర్నీకి పడిక్కల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.

కెరీర్ ఇలా

కెరీర్ ఇలా

2019-20 విజయ్ హజారే ట్రోఫీలో టోర్నమెంట్‌లోనే అత్యధిక పరుగులు సాధించి మంచి గుర్తింపు పొందాడు. 11 మ్యాచులు ఆడి 609 పరుగులు చేశాడు. 2019లో ఇండియా ఎ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. ఒక్కసారి అతని గణాంకాలను చూస్తే 15 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 907 పరుగులు చేశాడు. అత్యధికంగా 99 పరుగులు చేశాడు. 13 లిస్ట్ ఏ మ్యాచులు ఆడగా అందులో 650 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఇక 12 టీట్వంటీ మ్యాచులు ఆడగా.. 580 పరుగులు చేశాడు. అత్యధికంగా 122 పరుగులు చేశాడు.

IPL 2020: SRH vs RCB Match Preview, Pitch Report | Warner VS Kohli | Oneindia Telugu
ఆడిన అన్ని తొలి మ్యాచుల్లో హాఫ్ సెంచరీ

ఆడిన అన్ని తొలి మ్యాచుల్లో హాఫ్ సెంచరీ

ఇక సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ ఆది నుంచే రెచ్చిపోయాడు. కేవలం 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రషీద్ ఖాన్‌ వేసిన ఓవర్లో ఫోర్‌గా మలిచి హాఫ్ సెంచరీ చేసి జట్టుకు మంచి స్టార్ట్ అందించాడు. పడిక్కల్ మాంచి ఊపు మీద ఉండటంతో అతని సహచరుడు సీనియర్ ఆటగాడు ఆరోన్ ఫించ్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 11 ఓవర్లో విజయ్ శంకర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయి పెవీలియన్ దారి పట్టాడు. ఇక దేవదత్ తాను అరంగేట్రం చేసిన అన్ని ఫార్మాట్లలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 2018లో మహారాష్ట్రతో ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 7 మరియు 77 పరుగులు చేయగా ...2019లో జార్ఖండ్‌తో ఆడిన తొలి లిస్ట్ ఏ మ్యాచ్‌లో 58 పరుగులు చేశాడు. ఇక అదే ఏడాది ఉత్తరాఖండ్‌తో ఆడిన తొలి టీట్వంటీ మ్యాచ్‌లో 53 పరుగులు చేయగా.. తాజాగా 2020లో ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టుతో 56 పరుగులు చేశాడు.

మొత్తానికి ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే దుమ్ము లేపిన పడిక్కల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టైలిష్ షాట్లతో సెలెక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. ఇక దేవ్‌దత్ ప్రతిభ చూస్తే భవిష్యత్తులో భారత్‌కు మంచి ఓపెనర్ దొరికినట్లే భావించాల్సి ఉంటుంది.

Story first published: Monday, September 21, 2020, 20:56 [IST]
Other articles published on Sep 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+