RCB vs SRH: హర్షల్ పటేల్ అరుదైన ఘనత.. బుమ్రా, భువనేశ్వర్ రికార్డు బద్దలు!!

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (44; 38 బంతుల్లో 5×4), కేన్ విలియమ్సన్ (31; 29 బంతుల్లో 4×4) తప్ప మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్ 141 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు కీలక వికెట్లు పడగొట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ను దెబ్బకొట్టాడు. విలియమ్సన్, సాహా, హోల్డర్ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

హర్షల్ పటేల్ అరుదైన ఘనత:
ఈ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. మూడు వికెట్లు పడగొట్టడంతో ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటివరకు హర్షల్ పటేల్ ఐపీఎల్ 2021లో 13 మ్యాచులు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా ఐపీఎల్ 2020 సీజన్లో 15 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో భువీ 14 మ్యాచులలో 26 వికెట్లు తీశాడు.

అగ్రస్థానంలో బ్రావో:
ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు. 2013 సీజన్లో బ్రావో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కాగిసో రబడా రెండో స్థానంలో ఉన్నాడు. 2020 సీజన్లో రబడా 30 వికెట్లు తీశాడు. 29 వికెట్లతో హర్షల్ పటేల్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. 2011 సీజన్లో ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగా 28 వికెట్లు తీసి నాలుగో ఉండగా.. 2013లో జేమ్స్ ఫాల్కనర్ అదే 28 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరో మూడు వికెట్లు పడగొడితే:
సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచుకు ముందు హర్షల్ పటేల్ ఈ సీజన్లో 26 వికెట్లు పడగొట్టాడు. 12వ ఓవర్లో కేన్ విలియమ్సన్‌ను బోల్డ్ చేసి 27 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాతో సమానంగా నిలిచాడు. 18 వ ఓవర్లో వృద్ధిమాన్ సాహాను, 20వ ఓవర్లో జాసన్ హోల్డర్ వికెట్లను ఖాతాలో వేసుకుని టాప్‌లోకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం బెంగళూరు లీగ్ దశలో ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అలానే ప్లే ఆఫ్స్ చేరింది కాబట్టి మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. దాంతో హర్షల్ పటేల్ మరో మూడు వికెట్లు పడగొడితే.. డ్వేన్ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలుస్తాడు. నాలుగో వికెట్ పడగొడితే మాత్రం మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications