RCB vs SRH: డేవిడ్ వార్నర్ ఖాతాలో మరో రికార్డు.. మూడో విదేశీ కెప్టెన్‌గా!!

దుబాయ్: యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోహ్లీసేన తొలుత బ్యాటింగ్ చేస్తోంది. గతేడాది కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఆడిన హైదరాబాద్.. ఈసారి వార్నర్ తృత్వంలో బరిలోకి దిగింది.

బాల్ టాంపరింగ్ ఆరోపణలతో:
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2015 నుంచి 2017 వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2016లో తన కెప్టెన్సీలోనే హైదరాబాద్‌ను విజేతగా నిలిపాడు. అయితే బాల్ టాంపరింగ్ ఆరోపణలతో 2018 సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. వార్నర్ గైర్హాజరీలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అతడి కెప్టెన్సీలో ఆడిన హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఇక వార్నర్ గతేడాది తిరిగి సన్‌రైజర్స్ జట్టులోకి వచ్చినా.. కెప్టెన్సీ నిషేధం కారణంగా యాజమాన్యం అతనికి సారధ్య బాధ్యతలు అప్పగించలేదు. అయితే ఐపీఎల్-13వ సీజన్‌కు వార్నర్‌నే కెప్టెన్‌గా నియమించారు.

కెప్టెన్‌గా 48వ మ్యాచ్:
ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌కు 45 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన సమయంలో రెండు మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 47 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన వార్నర్.. ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ కెప్టెన్‌గా అతడికిది 48వది. దీంతో వార్నర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 47 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను వార్నర్ అధిగమించాడు.

మూడో విదేశీ ప్లేయర్‌గా:
ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన మూడో విదేశీ ప్లేయర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఆస్ట్రేలియా లెజండరీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఐపీఎల్‌లో 71 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేశారు. అతని తర్వాత ఆస్ట్రేలియా లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న 55 మ్యాచ్‌లకు సారథిగా చేసి రెండో స్థానంలో ఉన్నారు. 48 మ్యాచ్‌లతో వార్నర్ మూడో స్థానంలో నిలిచాడు. సంగక్కర (47) నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

క్యాష్‌రిచ్ లీగ్ 126 మ్యాచ్‌లు:
ఇప్పటి వరకు ఈ క్యాష్‌రిచ్ లీగ్ 126 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్.. 4,706 రన్స్ చేశాడు. 2015, 2017, 2019 సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచి ఆరేంజ్ క్యాప్ అందుకున్నాడు. తద్వారా ఎక్కువ సార్లు ఆరేంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ రెండేండ్ల తర్వాత మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టగా.. మరోసారి టైటిల్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications