Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ విజయం.. మాక్స్‌వెల్ మెరుపులు వృధా! ఏబీ ఎంత పనిజేస్తివి!!

RCB vs SRH: Bhuvneshwar Kumar helps Sunrisers seal last-over thriller vs Bangalore

అబుదాబి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో అబుదాబి వేదికగా చివరి బంతివరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి బంతికి 6 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ కుమార్ కేవలం ఒక పరుగు మాత్రమే చాడు ఇచ్చాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ తేడాతో గెలుపొందింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 142 లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 6 వికెట్లు 136 పరుగులే చేసింది. దేవ్‌దత్ పడిక్కల్‌ (41; 52 బంతుల్లో 4×4), గ్లెన్ మాక్స్‌వెల్ (40; 25 బంతుల్లో 3×4, 2x6) రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (5) ఏబీ డివిలియర్స్ (19) విఫలమయ్యారు. కీలక సమయంలో హైదరాబాద్ బౌలర్లు తలో వికెట్ తీసి జట్టు విజయంలో పలు పంచుకున్నారు.

మాక్స్‌వెల్‌ మెరిసినా:

మాక్స్‌వెల్‌ మెరిసినా:

స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్‌ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి డేనియల్ క్రిస్టియన్‌ (1) నిరాశ పరిచాడు. శ్రీకర్‌ భరత్‌ (12) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌.. గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. పడిక్కల్‌ కాస్త నెమ్మదిగా ఆడినా.. మ్యాక్సీ మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. దీంతో బెంగళూరు లక్ష్యం దిశగా సాగింది. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ అవ్వడంతో బెంగళూరు ఇన్నింగ్స్ గాడితప్పింది.

 భువీ అద్భుత బౌలింగ్:

భువీ అద్భుత బౌలింగ్:

ఈ సమయంలో ఏబీ డివిలియర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే షాబాజ్ అహ్మద్ (14)ను హోల్డర్ ఔట్ చేసి బెంగళూరుకు షాక్ ఇచ్చాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠతకు తెరలేపింది. ఇక చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 13 పరుగులు అవ్సరం కాగా.. ఏబీ క్రీజులో ఉండడంతో ఆర్‌సీబీ విజయంపై నమ్మకంగానే ఉంది. భువీ మొదటి బంతికి పరుగులు ఇవ్వలేదు. రెండో బంతికి సింగల్ ఇచ్చాడు. మూడో బంతిని డాట్ చేయగా.. నాలుగో బంతికి ఏబీ సిక్సర్ బాదాడు. దాంతో చివరి రెండు బంతుల్లో 6 రన్స్ అవసరం కాగా.. భువీ అద్భుత బౌలింగ్తో కేవలం ఒకే పరుగులు ఇచ్చి హైదరాబాద్ జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు.

 ఆదుకున్న రాయ్‌:

ఆదుకున్న రాయ్‌:

అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన హైదరాబాద్‌ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (13) జార్జ్ గార్టన్‌ బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (31; 29 బంతుల్లో 4×4)తో కలిసి మరో ఓపెనర్ జేసన్‌ రాయ్‌ (44; 38 బంతుల్లో 5×4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కాసేపు నిలకడగా ఆడారు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు పంపిస్తూ.. స్ట్రైక్ రొటేట్ చేశారు. ఈ క్రమంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 11.2వ బంతికి విలియమ్సన్‌ ఔట్‌ అయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ విలువైన భాగస్వామ్యానికి తెరపడింది.

 ముంచిన మిడిల్:

ముంచిన మిడిల్:

కేన్ విలియమ్సన్‌ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ప్రియమ్ గార్గ్‌ (15) ధాటిగా ఆడినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ సమయంలో డాన్ క్రిస్టియన్ సన్‌రైజర్స్ జట్టుకు మరో షాక్ ఇచ్చాడు. గార్గ్‌తో పాటు రాయ్‌ని కూడా ఔట్ చేశాడు. ఆ వెంటనే యుజువేంద్ర చహల్.. అబ్దుల్‌ సమద్‌ (1)ను పెవిలియన్ చేర్చాడు. వృద్ధిమాన్ సాహా (10) కూడా నిరాశపరిచాడు. చివర్లలో జేసన్‌ హోల్డర్‌ (16), రషీద్‌ ఖాన్‌ (7) వేగంగా ఆడకపోవడంతో సన్‌రైజర్స్ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. దీంతో హైదరాబాద్‌ జట్టు ప్రత్యర్థి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్ మూడు, డేనియల్ క్రిస్టియన్‌ రెండు.. జార్జ్‌ గార్టన్‌, యుజువేంద్ర చాహల్ తలో వికెట్‌ తీశారు.

Story first published: Wednesday, October 6, 2021, 23:50 [IST]
Other articles published on Oct 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+