RCB vs SRH:సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచిన మూడు తప్పిదాలు!

దుబాయ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో శుభారంభాన్ని అందుకోలేకపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులతో ఓటమిపాలైంది. అన్‌లక్కీగా కెప్టెన్ డేవిడ్ వార్నర్(6) విఫలమైనా.. బెయిర్‌స్టో(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) ఉన్నంతసేపు బెంబేలెత్తించాడు. అయితే ఆర్‌సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్పిన్‌తో మాయ చేయడం.. హైదరాబాద్ లోయరార్డర్ నిరాశపర్చడంతో ఆరెంజ్ ఆర్మీ బోణీ కొట్టలేకపోయింది.

మరోవైపు అరంగేట్ర ఆటగాడు దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 8 ఫోర్లతో 56), మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపడంతో.. బెంగళూరు అంచనాలను అందుకుంది. ఇక కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్లు ఆరెంజ్ ఆర్మీ ఓటమికి అన్ని కారణాలే కనిపిస్తున్నాయి. కీలక సమయంలో బెయిర్ స్టో వికెట్ కోల్పోవడం.. మిడిలార్డర్ బలహీనం.. లోయరార్డర్ నిరాశపర్చడంతో హైదరాబాద్ గెలుపు ముంగిట బోల్తాపడింది. ఇవన్నీ పక్కన పెడితే ఓ మూడు తప్పిదాలు ప్రధానంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయి.

 మహ్మద్ నబీని తీసుకోకపోవడం..

మహ్మద్ నబీని తీసుకోకపోవడం..

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని తీసుకోకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే నబీ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బ్యాట్‌తో బంతితో మెరిసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రషీద్ ఖాన్ కన్నా మెరుగ్గా రాణించాడు. ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించే దుబాయ్ పిచ్‌లపై అతను కీలకం. దేవదత్ పడిక్కల్ వంటి లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేయగలడు. అలాగే లోయారార్డర్‌లో ముఖ్య భూమిక పోషించేవాడు.

అతను ఉంటే బ్యాటింగ్ బలం పెరిగేది. అనుభవం లేని యువ ఆటగాళ్లకు అండ దొరికేది. ముఖ్యంగా నిన్నటి పరిస్థితుల్లో (24 బంతుల్లో 37 రన్స్) అతనుంటే ఫలితం మరోలా ఉండేది. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఆకాశ్ చోప్రా, గౌతమ్ గంభీర్ మ్యాచ్‌కు ముందు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నబీని చాలా తక్కువ అంచనా వేస్తున్నారని, అతను సూపర్ టాలెంటెడ్ ప్లేయరని గంభీర్ మొత్తుకున్నాడు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ పట్టించుకోకుండా మూల్యం చెల్లించుకుంది.

మిడిలార్డర్ బలహీనం..

మిడిలార్డర్ బలహీనం..

అనుభవం లేని ఆటగాళ్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ బలహీనంగా ఉంది. జట్టు బ్యాటింగ్ బలమంతా డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, మనీష్ పాండేలపైనే ఆధారపడి ఉంది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరూ విఫలమైనా.. హైదరాబాద్‌కు నిన్నటి పరిస్థితే ఎదురవుతుంది. గత సీజన్‌లో ఈ విషయం స్పష్టమైంది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో ఉన్నంత కాలం దూసుకుపోయిన హైదరాబాద్.. వాళ్లు ప్రపంచకప్ ప్రిపరేషన్స్‌ కోసం వెళ్లిపోవడంతో ఒక్కసారి డీలా పడిపోయింది. అయినా కూడా హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఈ విషయంపై ఫోకస్ చేయలేదు. వేలంలో యువ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇచ్చింది. 15 ఓవర్ల వరకు 121/2తో పటిష్టంగా ఉన్న జట్టు 5 ఓవర్లలోనే మిగతా 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకు ఆలౌటవ్వడం ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ బలహీనతను తెలియజేస్తుంది.

ఆ ఫినిషర్‌ను తీసుకొని ఉంటే..?

ఆ ఫినిషర్‌ను తీసుకొని ఉంటే..?

సన్‌రైజర్స్ హైదరాబాద్ బలం ఎప్పుడూ బౌలింగే. స్టార్ ప్లేయర్లు రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్‌‌లతో బౌలింగ్ విభాగానికి డోకాలేదు. అయితే నిన్నటి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మకు బదులు ఓ హిట్టర్‌ను తీసుకుంటే ఫలితం మరోలా ఉండేది. దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన అబ్దుల్ సమద్ జట్టులో ఉన్నాడు. అతన్ని అభిషేక్ శర్మ స్థానంలో ఆడించి ఉంటే బాగుండేది. ఫినిషర్‌గా అతనికి మంచి పేరుంది. భారీ సిక్సర్లను అలవోకగా ఆడగలడు. ఈ టీ20 ఫార్మాట్‌కు సరితూగే ఆటగాడు. కనీసం తదుపరి మ్యాచ్‌కు అయినా సమతూకమైన జట్టుతో బరిలోకి దిగడం చాలా ముఖ్యం.

గేమ్‌చేంజర్ చాహల్..

గేమ్‌చేంజర్ చాహల్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. పడిక్కల్, ఏబీడి చెలరేగగా.. ఆరోన్ ఫించ్(27 బంతుల్లో 29) ఫర్వాలేదనపించాడు. విరాట్ కోహ్లీ(14) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.

అనంతరం చేజింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయింది. చాహల్(3/18) ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించగా.. నవదీప్ సైనీ, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీశారు. డేల్ స్టెయిన్‌కు ఒక వికెట్ దక్కింది. విజయంలో కీలకపాత్ర పోషించిన చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కేఎల్ రాహుల్ అసభ్య పదజాలం.. ‘ముందుకు రారా లౌ**'అంటూ ఫీల్డర్‌పై ఫైర్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 22, 2020, 7:49 [IST]
Other articles published on Sep 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X