For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR Playing 11: తుది జట్లు ఇవే.. రియాన్ పరాగ్ ఔట్, శుభమ్ గార్వాల్ ఇన్

RCB vs RR probable playing 11.. riyan parag out, shubham garhwal in

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం మరో రసవత్తర పోరు జరగబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అకాడమీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభం కానుంది. భీకరమైన ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్‌ ఈ సీజన్లో 3 సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 15పరుగులతో ఓడించింది. రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్లో కొంత ఆందోళన ఉంది.

కాకపోతే ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఫామ్ అందుకోవడం.. ఆ జట్టుకు ఊరటనిస్తోంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడింది. 68పరుగులకే ఆలౌట్ అయింది. ఇక సన్‌రైజర్స్ కేవలం 8వ ఓవర్లలో ఆ టార్గెట్‌ను ఛేదించింది. ఎస్ఆర్‌హెచ్‌తో ఓటమి తర్వాత.. బెంగళూరు మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. వారి అనవసర బ్యాటింగ్ తప్పిదాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరముంది.

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తన టీంలో దాదాపు ఎలాంటి మార్పులు చేయకుండానే ఆర్ఆర్‌తో బరిలో దిగే అవకాశముంది. గత మ్యాచ్‌లో జట్టులో సమిష్టి వైఫల్యం కనబడింది కాబట్టి.. ఏ ఒక్కరిని తప్పు పట్టే వీల్లేకుండా ఉంది. కాకపోతే ఓ మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్ అనుజ్ రావత్.. నిలకడ లేమి ఆటతో నిరాశపర్చుతున్నాడు. షాబాజ్ అహ్మద్, ప్రభుదేశాయి లాంటి దేశీయ ప్లేయర్లు అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది.

RCB vs RR probable playing 11.. riyan parag out, shubham garhwal in

ఇక రాజస్థాన్ రాయల్స్ టీంలో రియాన్ పరాగ్‌ను తీసేసే ఆలోచనలో జట్టు ఉంది. వరుసగా విఫలమవుతున్న రియాన్ పరాగ్ స్థానంలో ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితమైన శుభమ్ గార్వాల్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఒబెడ్ మెక్‌కాయ్‌ ప్లేస్‌లో జిమ్మీ నీషమ్‌ను తీసుకుంటారో లేదో కొంత కన్ఫ్యూజన్ ఉంది. మిగతా జట్టును యథావిధిగా కొనసాగించొచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ 11: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా డిసిల్వా, జోష్ హజిల్‌వుడ్,

రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్, శుభమ్ గర్వాల్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబేడ్ మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

Story first published: Tuesday, April 26, 2022, 11:55 [IST]
Other articles published on Apr 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+