For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR: రాజస్థాన్ జట్టులోకి అతడొచ్చాడు - ఆర్సీబీ ఫుల్ అలర్ట్!

RCB vs RR: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా తాజాగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ సీజన్ లో ఇది 42వ మ్యాచ్. ఈ మ్యాచులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్ కు దిగింది.

మార్పులు లేవ్.. అదే ముఖ్యం..
"మేమూ మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం. ఈ సీజన్‌లో పిచ్ చాలా ట్రికీగా, అప్రెడిక్టబుల్‌గా ఉంది. వీలైనంత త్వరగా పిచ్ పరిస్థితిని అడాప్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాం. షాట్ సెలెక్షన్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేం అలర్ట్ గా ఉన్నాం. మేము అదే జట్టుతో ఆడుతున్నాం, ఎలాంటి మార్పులు చేయట్లేదు." అని రజత్ పటీదార్ పేర్కొన్నాడు.

ఒక్క మార్పుతో రాజస్థాన్..
"మేము మొదట బౌలింగ్ చేస్తాం. పిచ్ కాస్త స్టిక్కీగా కనిపిస్తోంది. మ్యాచ్ సాగే కొద్దీ మెరుగవుతుంది అనిపిస్తోంది. మనం 100 శాతం మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నం చేస్తే, ఫలితాలు అవే వస్తాయి. సంజూ శాంసన్ కోలుకుంటున్నాడు. అతడు త్వరగా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. ఒక్క మార్పుతో ఈ మ్యాచు బరిలోకి దిగుతున్నాం. తీక్షణ స్థానంలో ఫారూఖీ జట్టులోకి వచ్చాడు. " అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.

RCB vs RR: రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
రాజస్థాన్ తుది జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. మహేశ్ తీక్షణ స్థానంలో ఫజల్ హక్ ఫారూఖీని తీసుకున్నారు. యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వానిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, ఫజల్ హక్ ఫారూథీ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ
RCB vs RR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ (కెప్టెన్), దేవత్ పడిక్కల్, జితేశ్ శర్మ (వికెట్క్వేర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాళ్.

RCB VS RR IPL 2025 Royal Challengers Bengaluru won the toss against Royal challengers bengaluru
Story first published: Thursday, April 24, 2025, 19:22 [IST]
Other articles published on Apr 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+