RCB vs PBKS: కెప్టెన్ పాటిదార్ ఔట్.. ఆర్సీబీ జట్టులో కీలక మార్పులు!
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో ప్రతి పోరు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇందులో భాగంగా ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ లక్ పంజాబ్‌ను వరించింది. ఈ హోరాహోరీ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమాత్రం ఆలోచించకుండా మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. స్టేడియం రికార్డులు లేదా గత గణాంకాలను తాను పెద్దగా పట్టించుకోవడం లేదని, ప్రస్తుత మ్యాచ్‌లు సాగుతున్న తీరును బట్టి చూస్తే లక్ష్యచేధన వైపే మొగ్గు చూపడం ఉత్తమమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైనది, ఒక మైలురాయి లాంటిది. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా ఇది శ్రేయస్ అయ్యర్‌కు 100వ మ్యాచ్ కావడం విశేషం. టాస్ సమయంలో ఈ విషయంపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. "కెప్టెన్‌గా ఇది నా 100వ మ్యాచ్ అనే విషయం నాకు ముందుగా తెలియదు. కానీ ఈ మైలురాయి మ్యాచ్‌లో మా జట్టు విజయం సాధిస్తే మాత్రం నేను ఎంతగానో సంతోషిస్తాను. గత కొన్ని మ్యాచ్‌లుగా మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. మైదానంలో ఒత్తిడిని అధిగమించి, ఆటను పూర్తిగా ఆస్వాదించడమే మా లక్ష్యం" అని పేర్కొన్నాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం పంజాబ్ జట్టు తమ తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌తో పాటు స్పీడ్‌స్టర్ లూకీ ఫెర్గూసన్ ప్లేయింగ్-11 లోకి వచ్చారు.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపేవారమని ఒప్పుకున్నాడు. అయితే మొదట బ్యాటింగ్ చేయాల్సి రావడం పెద్ద మైనస్ ఏమీ కాదని, ధర్మశాల వికెట్ చాలా అద్భుతంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 40 ఓవర్ల పాటు ఈ పిచ్ బ్యాటింగ్‌కు ఒకేలా అనుకూలించే అవకాశం ఉందన్నాడు. స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ ఫామ్‌ను మెచ్చుకుంటూ.. అతను ప్రస్తుతం ఫెంటాస్టిక్ టచ్‌లో ఉన్నాడని, త్వరలోనే హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో అతడు మళ్లీ బరిలోకి దిగుతాడని జితేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్లేఆఫ్స్ రేసు పరంగా ఇరు జట్లకు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో జితేష్ శర్మ మాట్లాడుతూ.. "ప్రస్తుత తరుణంలో మాకు ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ మ్యాచ్‌లో వచ్చే విజయం మా జట్టు భవిష్యత్తునే కాకుండా, పాయింట్ల పట్టికలోని ఇతర జట్ల ప్లేఆఫ్స్ సమీకరణాలను కూడా పూర్తిగా మార్చేస్తుంది" అని వెల్లడిచాడు. ఈ కీలక పోరు కోసం ఆర్సీబీ మేనేజ్‌మెంట్ తమ తుది జట్టులో కొన్ని వ్యూహాత్మక మార్పులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్థానంలో యువ ఆటగాడు సుయాష్ శర్మను జట్టులోకి తీసుకోగా.. బౌలింగ్ విభాగంలో డఫీ స్థానంలో విధ్వంసకర ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌కు స్థానం కల్పించింది. మరి ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు కట్టడి చేస్తారా లేక ఆర్సీబీ భారీ స్కోరు సాధిస్తుందో చూడాలి.
తుది జట్లు ఇవే:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్ కీపర్, కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications