Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs PBKS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. మూడు మార్పులతో బరిలోకి పంజాబ్!!

RCB vs PBKS playing 11 is out: Sarfaraz omes in for Hooda and Moises Henriques for Ellis

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో ఉత్కంఠ పోరుకు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య జరుగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు పంజాబ్ మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగుతొంది. దీపక్ హుడా స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ మరియు ఎల్లిస్ బదులుగా మోయిసెస్ హెన్రిక్స్ జట్టులోకి వచ్చాడు. హర్‌ప్రీత్ బ్రార్ కూడా చోటు దక్కించుకున్నాడు.

ప్లే ఆఫ్స్‌ చేరాలంటే ఆర్‌సీబీ, పీబీకేఎస్ జట్లకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా పంజాబ్ జట్టుకు. ఐపీఎల్ 2021లో ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన పంజాబ్ ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లతో ఇదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో విజయాలు సాధిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుతం ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్‌తో కలిసి పంజాబ్ 10 పాయింట్లతో సమంగా ఉంది. పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ 'డూ ఆర్ డై' మ్యాచ్‌ చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరుకు బెర్తు ఖరారవుతుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న మిగతా నాలుగు జట్లలో ఏదీ ఎనిమిది విజయాలు సాధించే అవకాశం లేదు కాబట్టి బెంగళూరు వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా ముందంజ వేస్తుంది. ఒకవేళ ఆర్‌సీబీ చేతిలో ఓడితే పంజాబ్‌ పనైపోయినట్లే. రెండు జట్ల మధ్య విజయాలను మనం ఓ సారి పరిశీలిస్తే.. పంజాబ్‌ జట్టు ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పంజాబ్ 15, బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలిచింది.

తుది జట్టు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కోన శ్రీకర్ భారత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.
పంజాబ్ కింగ్స్: లోకేష్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.

Story first published: Sunday, October 3, 2021, 15:19 [IST]
Other articles published on Oct 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+