Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'చాహల్ నువ్వంటే చాలా ఇష్టం!.. తొలిసారి ఎప్పుడు కలిశామో గుర్తుందా?'

RCB VS PBKS: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. ఇటీవలే కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అత్యంత స్వల్ప స్కోరును (112) కాపాడుకుని అదిరే విజయాన్ని సాధించింది. ఈ మ్యాచులో చాహల్ 4/28 దెబ్బకు కేకేఆర్ 95 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో చాహల్ పై పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రశంసల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే 2009లో తామిద్దరు కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ గా మారింది. అలానే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసి పంజాబ్ మ్యాచ్ ఆడుతోన్న సందర్భంగా చాహల్ తో కలిసి చేసిన చిట్ చాట్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

"ఎలా మొదలైంది ఇప్పుడు ఎలా సాగుతోంది. అప్పుట్లో 2009లో కింగ్స్ కప్ సందర్భంగా చాహల్ ను కలిశాను. అప్పుడు నేను క్రికెట్ కు కొత్త. అతనేమో అండర్ 19 క్రికెటర్. ఇన్నేళ్ల ప్రయాణంలో అతడు అద్భుతమైన క్రికెటర్ గా ఎదిగాడు. అతడి పోటీతత్వం నాకు నచ్చుతుంది. అందుకే అతడు నా జట్టులో ఉండాలని అనుకుంటాను. నేను చాహల్ కు బిగ్ ఫ్యాన్. ఎందుకంటే గత మ్యాచులోని అతడి ప్రదర్శనే ఇందుకు కారణం. ఎన్నో ఏళ్లుగా అతడు ఇలానే రాణిస్తున్నాడు." అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ప్రీతి జింటా.

RCB VS PBKS IPL 2025 Preity zinta shares special moment with chahal photo goes viral
Photo Credit: twitter screenshot

ప్రీతీ జింటా: తక్కువ లక్ష్యం ఉన్న సమయంలో బౌలింగ్‌కు వచ్చావ్ కదా? అప్పుడు ఏమనుకున్నావ్?
చాహల్: అప్పుడు ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడం అంత తేలికగా అనిపించలేదు. పవర్‌ ప్లే ఎంతో కీలకమని భావించాను. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌తో కూడా ఇదే మాట్లాడాం. జట్టుగా కలిసి పోరాడాం.

ప్రీతి జింటా: 2009లో డర్బన్‌ లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 119 పరుగులే చేశాం కదా. కానీ అప్పుడు, ఆ జట్టును 116 పరుగులకే కట్టడి చేశాం. ఇప్పుడు కూడా అదే జరగాలని అనుకున్నా. అదే జరిగింది. నీ ప్రదర్శన చూసి గర్వంగా అనిపించింది.
ప్రీతి జింటా: భారత్‌ తరఫున నువ్వు చెస్ కూడా ఆడావు కదా?
చాహల్‌: అవును.. చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడాను.

ప్రీతి జింటా: ఆండ్రూ రస్సెల్‌ను ఔట్‌ చేసేందుకు ఏం ప్లాన్ చేశారు?
చాహల్: రస్సెల్ క్రీజ్‌లో ఉన్నాడంటే.. మా నుంచి మ్యాచ్‌ లాగేసుకుంటాడు. అందుకే అతడికి ఎక్కువగా స్ట్రైకింగ్‌ రాకుండా చేశాం. అందుకే లక్ష్యాన్ని కాపాడుకోగలిగాం.
ప్రీతి జింటా: సరే, ఇంకా ముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ గురించి తెలుసు కదా. నేను నీకు పెద్ద అభిమానినని ఇప్పటికే చెప్పాను. అద్భుతంగా ఆడుతున్నావు. థ్యాంక్స్.

Story first published: Friday, April 18, 2025, 16:18 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+