Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs PBKS: ఫైనల్‌లో ఎవరు గెలుస్తారు?.. యోగరాజ్ సింగ్ కీలక ప్రకటన

RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లలో ఏదీ కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఐపీఎల్ కొత్త ఛాంపియన్‌ను పొందబోతోంది. అయితే ఐపీఎల్ ఫైనల్ గురించి చాలా అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మాజీ క్రికెటర్ యోగరాజ్ కింగ్ కూడా ఈ సారి ఫైనల్‌లో ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేశారు.

ఫైనల్ గురించి యోగరాజ్ సింగ్ అంచనా
మాజీ లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. పంజాబ్ కింగ్స్ బౌలర్లు విరాట్ కోహ్లీని ముందుగానే ఔట్ చేయలేకపోతే వారు ఇబ్బందుల్లో పడతారన్నారు. విరాట్ కోహ్లీ ఔట్ కాకపోతే వారు 200 లేదా 300 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలరని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ 10 ఓవర్లలోపు ఔట్ అయితే పంజాబ్ గెలవగలదని తాను భావిస్తున్నానన్నారు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో గొప్ప కెప్టెన్, ఆటగాడు ఉన్నాడన్నారు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉండగా.. పంజాబ్ జట్టులో శ్రేయస్ ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ల మధ్య జరుగుతోందన్నారు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ కోసం మ్యాచ్ గెలవగలిగితే.. శ్రేయస్ అయ్యర్ ఏ పరిస్థితిలోనైనా పంజాబ్ కోసం గెలవగలడని.. పంజాబ్ గెలవాలని యోగరాజ్ సింగ్ కోరుకున్నారు.

RCB vs PBKS IPL 2025 Final Yograj Singh Predicts Winner Ahead of High-Stakes Clash

అద్భుతమైన ఫామ్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌లు ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో 146.53 స్ట్రైక్ రేట్‌తో 614 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ముందుగానే ఔటయ్యాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో 175.80 స్ట్రైక్ రేట్‌తో 603 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్థ శతకాలు ఉన్నాయి.

ఐపీఎల్ క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందులో 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 19వ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తమ కెప్టెన్ నుంచి ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది.

Story first published: Tuesday, June 3, 2025, 7:54 [IST]
Other articles published on Jun 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+