Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs PBKS: ముగింపు వేడుక కారణంగా మ్యాచ్ సమయం మారుతుందా?

RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల జరగనుంది. ముందుగా ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మే 25న జరగాల్సి ఉండగా.. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 10 రోజుల పాటు నిలిపివేయబడింది. ఆ తర్వాత రాబోయే మ్యాచ్‌ల కొత్త షెడ్యూల్‌ను మార్పులతో విడుదల చేశారు. దీని కారణంగా ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలో కాకుండా అహ్మదాబాద్‌లో జరుగుతోంది. అదే సమయంలో మ్యాచ్‌కు ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో ముగింపు వేడుక జరిగే అవకాశం ఉంది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. దీని కారణంగా మ్యాచ్ ప్రారంభ సమయం మారుతుందా అనే ప్రశ్న అభిమానుల మనస్సుల్లో తలెత్తుతోంది.

ఫైనల్ సమయం మారబోతోందా?
ఐపీఎల్ 2025 ముగింపు వేడుక చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ సందర్భంగా భారత సైన్యానికి నివాళులు అర్పిస్తారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు నివాళులు అర్పించనున్నారు. ఈ ముగింపు వేడుక సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ముగిఫు వేడుక మ్యాచ్ సమయంపై ఎటువంటి ప్రభావం చూపదు. మ్యాచ్ షెడ్యూల్ చేయబడిన సమయం ప్రకారం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ టాస్ 7 గంటలకు జరుగుతుంది. మీరు స్టార్ స్పోర్ట్స్ లో ముగింపు వేడుకను చూడవచ్చు.

RCB vs PBKS IPL 2025 Final Will the Match Timing Change Due to Closing Ceremony

ఈ ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్
ఈ సారి ఐపీఎల్ కొత్త ఛాంపియన్‌ను పొందబోతోంది. ఎందుకంటే ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, ఆర్సీబీలలో ఏ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఈ క్రమంలో నేడు రజత్ పాటిదార్ లేదా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించే సువర్ణావకాశం ఉంది. ఆర్సీబీ నాలుగో సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. గతంలో చివరిసారిగా 2016లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని చవిచూసింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ చివరిసారిగా 2014లో ఐపీఎల్ ఫైనల్ ఆడింది.

కీలక పాత్ర పోషించనున్న టాస్
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటుంది. కానీ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 8 మ్యాచ్‌‌లలో ఆరింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కానీ మంచు ప్రభావం ఛేజింగ్ కు అనుకూలంగా మారుతుందని అర్థమవుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు.

.

Story first published: Tuesday, June 3, 2025, 14:45 [IST]
Other articles published on Jun 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+