Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs MI: అత‌ను భ‌విష్య‌త్ ఆశా కిర‌ణం.. యువ ప్లేయ‌ర్‌పై ఆర్సీబీ కెప్టెన్‌, కోచ్ ప్ర‌శంస‌లు

RCB vs MI: Royal Challengers Bangalore captain faf Du plessis and coach Sanjay praise Anuj Rawat

శనివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆ జ‌ట్టు ఓపెన‌ర్ అనూజ్‌ రావత్‌పై కెప్టెన్ ఫాఫ్ డిప్లిసెస్ ప్ర‌శంస‌లు కురిపించాడు. అత‌ను భ‌విష్య‌త్ ఆశాకిర‌ణం అని కొనియాడాడు. కాగా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో అనూజ్ రావ‌త్ 66 ప‌రుగుల‌తో చెల‌రేగి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టును గెలిపించిన సంగ‌తి తెలిసిందే.

అత‌ను భవిష్య‌త్ ఆశాకిర‌ణం

అత‌ను భవిష్య‌త్ ఆశాకిర‌ణం

అనూజ్ రావత్‌కు మ్యాచ్‌లు గెలిపించ‌గ‌ల స‌త్తా ఉంద‌ని, అత‌ను భ‌విష్య‌త్ ఆశాకిర‌ణం అని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డిప్లిసెస్ కొనియాడాడు. మ్యాచ్‌కు ముందు అనూజ్‌తో ఎన్నో విష‌యాలు చ‌ర్చించిన‌ట్లు ఆయ‌న తెలిపాడు. అటు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కోచ్ సంజయ్ కూడా అనూజ్ రావ‌త్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

సీజ‌న్ ఆరంభంలో అనూజ్ త‌డ‌బ‌డిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం బాగా ఆడుతున్నాడ‌ని కొనియాడాడు. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో అద్భుత‌మైన షాట్లు ఆడాడ‌డ‌ని, కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్‌, విరాట్ కోహ్లీతో క‌లిసి మంచి భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడ‌ని ప్ర‌శంసించాడు. అనూజ్‌లో క‌ష్ట‌ప‌డే మ‌న‌స్తత్వం ఉంద‌ని చెప్పిన సంజ‌య్.. అత‌ని ఇన్నింగ్స్ ప‌ట్ల సంతోషంగా ఉన్న‌ట్లు తెలిపాడు.

ఆకాష్ దీప్‌పై ప్ర‌శంస‌లు

ఆకాష్ దీప్‌పై ప్ర‌శంస‌లు

అలాగే బౌల‌ర్ ఆకాష్ దీప్‌పై కూడా కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడ‌ని, అత‌డి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని కొనియాడాడు. ఇక ముంబై ఇండియ‌న్స్ వంటి అత్యుత్త‌మ జ‌ట్టుపై గెల‌వ‌డంపై డుప్లిసెస్ సంతోషం వ్య‌క్తం చేశాడు. త‌మ బౌల‌ర్లు అత్యుత్త‌మ బౌలింగ్ చేశార‌ని, అలాగే 18 ఓవ‌ర్ల‌పాటు త‌మ బ్యాటింగ్ అద్భుతంగా సాగింద‌ని డుప్లిసెస్ చెప్పాడు.

ఆర్సీబీ విజయం

ఆర్సీబీ విజయం

ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై 7 వికెట్ల తేడాతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 6 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది. ఒకానొక ద‌శ‌లో 79 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయిన్ప‌టికి సూర్య‌కుమార్ యాద‌వ్ ఆదుకున్నాడు. అత‌ను 68 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ 26, ఇషాన్ కిష‌న్ 26, జ‌య‌దేవ్ ఉన‌ద్కత్ 13*, డెవాల్డ్ బ్రెవిస్ 8, ర‌మ‌న్ దీప్ సింగ్ 6 ప‌రుగులు చేయ‌గా.. తిల‌క్ వ‌ర్మ‌, పొలార్డ్ డ‌కౌట్ అయ్యారు.

ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ రెండేసి, ఆకాష్ దీప్ వికెట్ తీశారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో అనుజ్ రావ‌త్ 66, విరాట్ కోహ్లీ 48, ఫాఫ్ డుప్లిసెస్ 16, మాక్స్‌వెల్ 8*, దినేష్ కార్తీక్ 7* ప‌రుగులు చేశారు.

నేటి మ్యాచ్‌లు

నేటి మ్యాచ్‌లు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో నేడు కూడా రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబైలోని బ్ర‌బోర్న్ స్టేడియం వేదిక‌గా మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానున్న మ‌రో మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

Story first published: Sunday, April 10, 2022, 14:21 [IST]
Other articles published on Apr 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+