RCB vs MI: వారెవ్వా.. వాటే మ్యాచ్.. ఉత్కంఠకే ఊపిరందలేదు.. ఆర్‌సీబీ అద్భుత విజయం

IPL 2020,RCB vs MI Highlights : Royal Challengers Defeated Mumbai Indians In Super Over || Oneindia

దుబాయ్: వారెవ్వా.. వాటే మ్యాచ్..! ఓవైపు ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. మరోవైపు ఇషాన్ కిషాన్ (58 బంతుల్లో 2 ఫోర్లు 99), కీరన్ పొలార్డ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో మాయ చేశారు.!

వీరీ పోరాట స్పూర్తికి పరీక్ష పెడుతూ టైగా ముగిసిన మ్యాచ్‌లో.. ఆర్‌సీబీ స్పెషలిస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ అతిపెద్ద మ్యాజిక్ చేశాడు. భీకర బ్యాటింగ్ లైనప్‌ ఉన్న ముంబై ఇండియన్స్‌ను సూపర్ ఓవర్‌లో 7 పరుగులకే కట్టడి చేసి ఓ వికెట్ తీశాడు. అనంతరం యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాను కింగ్ కోహ్లీ, మిస్టర్ 360 చెరొక బౌండరీతో బాదేయడంతో చేజారిపోయిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ అద్భుత విజయాన్నందుకుంది.

గత మ్యాచ్‌లో ఎదురైన దారుణ పరాజయం నుంచి కోలుకున్న ఆర్‌సీబీ.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్, పొలార్డ్ సూపర్ బ్యాటింగ్‌తో 5 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఇసురు ఉడాన రెండు వికెట్లు తీయగా.. సుంధర్, చహల్, జంపా తలో వికెట్ తీశారు.

సూపర్ ఓవర్ సాగిందిలా...?

సూపర్ ఓవర్ సాగిందిలా...?

సూపర్ ఓవర్‌ వేసిన సైనీ.. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇచ్చాడు. మూడో బంతిని పొలార్డ్ డాట్ చేసి.. నాలుగో బంతిని లాంగాఫ్‌లో బౌండరీకి తరలించాడు. ఐదో బంతిని డీప్ మిడ్ వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడిన పొలార్డ్.. గుర్‌క్రిత్ సింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. క్రీజులోకి రోహిత్ రాగా.. ఆఖరి బంతిని కనెక్ట్ చేయలేకపోయిన హార్దిక్ పాండ్యా.. పరుగు తీశాడు. దీంతో 7 పరుగులు వచ్చాయి. అనంతరం ముంబై తరఫున బుమ్రా సూపర్ ఓవర్ అందుకోగా.. విరాట్, డివిలియర్స్ బరిలోకి దిగారు. తొలి రెండు బంతులు సింగిల్స్ రాగా.. మూడో బంతి డాట్ అయింది. అయితే ఈ బంతికి ముంబై ఆటగాళ్లు అప్పీలు చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. దీంతో రివ్యూ తీసుకున్న ఏబీడీ సక్సెస్ అయ్యాడు. బంతికి బ్యాట్ తగలలేదని స్పష్టమైంది. మరసటి బంతిని ఫైన్ లెగ్ దిశగా డివిలియర్స్ బౌండరీ కొట్టి సింగిల్ తీసాడు. దీంతో మ్యాచ్ మరోసారి టై కావడంతో ఉత్కంఠతను తలిపించింది. కానీ ఆఖరి బంతిని కోహ్లీ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టడంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది.

 ఆరంభంలోనే గట్టి షాక్..

ఆరంభంలోనే గట్టి షాక్..

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ(8) వాషింగ్టన్ సుంధర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఇసురు ఊడానా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్లకు 35 రన్స్ చేసింది. మరో ఓపెనర్ డికాక్(14) కూడా విఫలమయ్యాడు. చహల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చి హార్దిక్ పాండ్యా వచ్చిరావడంతోనే ఓ భారీ సిక్సర్ కొట్టాడు.

ఇషాన్ కిషాన్ సెంచరీ మిస్

ఇషాన్ కిషాన్ సెంచరీ మిస్

మరోవైపు ఇషాన్ కిషన్ కూడా వీలు చిక్కిన బంతిని బౌండరీలకు తరలించాడు. ఈ జోడీ క్రీజులో కుదురుకుంటుందనగా.. జంపా దెబ్బతీశాడు. అతని బౌలింగ్‌లో ఓ భారీ షాట్ ఆడిన పాండ్యా.. బౌండరీ లైన్ వద్ద సబ్‌స్టిట్యూట్ పవన్ నేగికి చిక్కి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పొలార్డ్ నిదానంగా ఆడగా.. ఇషాన్ కిషాన్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇషాన్.. జంపా వేసిన 14వ ఓవర్ చివరి బంతిని భారీ సిక్సర్‌గా మలిచి 39 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

చెలరేగిన పొలార్డ్

చెలరేగిన పొలార్డ్

ఇక చాహల్ వేసిన 15వ ఓవర్‌లో ఇషాన్ సిక్సర్ కొట్టగా.. పొలార్డ్ ఫోర్ కొట్టడంతో 15 రన్స్ వచ్చాయి. జంపా వేసిన 17వ ఓవర్‌లో పొలార్డ్ 3 సిక్స్‌లు ఒక ఫోర్‌తో 27 పరుగులు పిండుకున్నాడు. అయితే ఈ ఓవర్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లు రెండు క్యాచ్‌లు చేజార్చారు. చాహల్ వేసిన 18వ ఓవర్‌లో పొలార్డ్ రెండు సిక్స్‌లు, ఇషాన్ కిషన్ ఓ సిక్స్ కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి లాంగాన్‌లో భారీ సిక్సర్ కొట్టిన పొలార్డ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సైనీ వేసిన 19వ ఓవర్‌లో ఇషాన్ కిషాన్ ఒక సిక్సర్ కొట్టడంతో 12 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై ఇండియన్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 19 పరగులు అవసరమయ్యాయి. ఉడాన వేసిన ఆఖరి ఓవర్‌లో ఇషాన్ కిషాన్ రెండు సిక్స్‌లు కొట్టి 99 పరుగుల వద్ద ఔటవ్వగా.. ఆఖరి బంతికి పొలార్డ్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌కు దారితీసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 28, 2020, 23:59 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X