Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. హార్దిక్ వచ్చేశాడు! మూడు మార్పులతో బరిలోకి బెంగళూరు!!

RCB vs MI playing 11 is out: Tiwary out and Hardhik Pandya in, Christian and Jamieson played

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తుది జట్టులో ఒక మార్పు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చాడు. దాంతో సౌరబ్ తివారికి నిరాశే ఎదురైంది. మరోవైపు బెంగళూరు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. షాబాజ్ అహ్మద్‌, డేనియల్‌ క్రిస్టియాన్‌, కైల్ జేమీసన్‌ మ్యాచ్ ఆడనున్నారు.

ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. ఇందులో బెంగళూరు 11, ముంబై 17 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇటీవలి కాలంలో ముంబైపై బెంగళూరు ఎక్కువగా విజయాలు అందుకోలేదు. రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు ఘోరంగా ఓడిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గతంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. అందులో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఐపీఎల్ 2021లో అన్ని విభాగాల్లో రెండు జట్లు బలంగా ఉన్నా.. విజయాలు మాత్రం అందుకోవట్లేదు. ముఖ్యంగా ముంబై. అందుకే ఈ మ్యాచులో ముంబై గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది.

ముంబై ఇండియన్స్ చరిత్ర ప్రకారం.. లీగ్‌ను ఓటములతో ప్రారంభించి ప్లే ఆఫ్ మాత్రం అందరికంటే ముందుగానే చేరుతుంటుంది. కానీ ఐపీఎల్ 2021లో ముంబై పూర్తిగా తేలిపోతుంది. ఇక ఫేజ్-2లో కేవలం 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముంబైకి ఇప్పటికే సమయం మించిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడితే ముంబైకి టాప్-4లో చోటు కష్టమవనుంది. ముంబై బ్యాటర్లతో సహా బౌలర్లు కూడా తేలిపోతున్నారు. ఇదే ఆ జట్టుకు పెద్ద ప్రతికూలతగా మారింది. మరోవైపు బెంగళూరు ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్లాలని చూస్తోంది. మొత్తానికి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

తుది జట్టు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా,ఆడమ్ మిల్నే, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్, శ్రీకర్‌ భరత్‌ (వికెట్ కీపర్), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, షాబాజ్ అహ్మద్‌, డేనియల్‌ క్రిస్టియాన్‌, కైల్ జేమీసన్‌, హర్షల్ పటేల్‌, యుజవేంద్ర చహల్‌, మొహ్మద్ సిరాజ్‌.

Story first published: Sunday, September 26, 2021, 19:41 [IST]
Other articles published on Sep 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+