RCB vs MI dream11 Prediction: ఆర్‌సీబీ vs ఎంఐ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ఇంజురీ అప్‌డేట్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా 39వ మ్యాచ్‌లో ఈరోజు అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

అలాగే స్టార్ స్పోర్ట్స్‌లోనూ అభిమానులు ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఐపీఎల్ 2021 ఫేజ్-2 లో బెంగళూరు, ముంబై జట్లు ఇంకా విజయం సాధించలేదు. మరి ఈ మ్యాచులోనైనా గెలిచి పోటీలోకి రావాలని ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. ప్లే ఆఫ్ చేరేందుకు ఇరు జట్లకు అవకాశాలు ఉన్నాయి.

ముంబైదే పైచేయి

ముంబైదే పైచేయి

ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. ఇందులో బెంగళూరు 11, ముంబై 17 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇటీవలి కాలంలో ముంబైపై బెంగళూరు ఎక్కువగా విజయాలు అందుకోలేదు. రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు ఘోరంగా ఓడిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గతంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. అందులో ఆర్‌సీబీ విజయం సాధించింది. అన్ని విభాగాల్లో రెండు జట్లు బలంగా ఉన్నా.. విజయాలు మాత్రం అందుకోవట్లేదు. ముఖ్యంగా ముంబై. అందుకే ఈ మ్యాచులో ముంబై గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని చూస్తోంది.

 సమయం మించిపోయింది

సమయం మించిపోయింది

ముంబై ఇండియన్స్ చరిత్ర ప్రకారం.. లీగ్‌ను ఓటములతో ప్రారంభించి ప్లే ఆఫ్అందరికంటే ముందుగానే చేరుతుంటుంది. అయితే ఐపీఎల్ ఫేజ్-2లో కేవలం 5 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముంబైకి ఇప్పటికే సమయం మించిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడితే ముంబైకి టాప్-4 చోటు కష్టమవనుంది. ముంబై బ్యాటర్లతో సహా బౌలర్లు కూడా తేలిపోతున్నారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లో 53 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 42 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్‌గా నిలాచాడు. ఆ మ్యాచులో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.

హార్దిక్ ఇన్

హార్దిక్ ఇన్

సెకండాఫ్‌లో ఫస్ట్ మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ.. కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. 30 బంతుల్లో 33 పరుగులు చేశాడు. క్వింటన్ డికాక్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో ఈ జోడీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు.

వీరి వైఫల్యం ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా సూర్యకుమార్ ఫామ్ కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రతీ మ్యాచ్‌లో నిలకడగా రాణించే సూర్య.. ఈ రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమ్యాడు. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో ఈ ఇద్దరు రాణించడం అటు భారత జట్టుకు ఇటు ముంబై ఇండియన్స్‌కు మంచిది. గత రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ బరిలోకి దిగనున్నాడు.

ఆల్‌రౌండర్లుగా పొలార్డ్, కృనాల్ పాండ్యా సత్తాచాటాల్సి ఉంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్ ఇప్పటివరకు అంచులను అందుకోలేదు. ఇప్పటికైనా వారు గాడిలో పడితే ముంబై విజయావకాశాలు మెరుగవుతాయి.

ఏబీ, మ్యాక్సీ చెలరేగితే

ఏబీ, మ్యాక్సీ చెలరేగితే

బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు పరుగులు చేస్తున్నారు. స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. ఈ ఇద్దరు కూడా చెలరేగితే బెంగళూరు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. తొలి దశలో ఈ ఇద్దరు బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. శ్రీకర్ భారత్ కూడా బ్యాట్ జులిపించాల్సి ఉంది.

కైల్ జమీసన్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. వనిందు హసరంగ వరుసగా 2 మ్యాచ్‌లలో ఆకట్టుకోలేకపోవడంతో అతడి స్థానంలో రజత్ పటీదార్‌ని అదనపు బ్యాట్స్‌మన్‌గా చేర్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆర్‌సీబీ తమ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. షాబాజ్ అహ్మద్ లేదా నవదీప్ సైనీ ఒక్కరే మ్యాచ్ ఆడనున్నారు.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రజత్ పటీదార్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, శ్రీకర్ భారత్ (కీపర్) కైల్ జమీసన్/టిమ్ డేవిడ్, హర్షల్ పటేల్, నవదీప్ సైనీ/షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

డ్రీమ్ 11 టీమ్:

డ్రీమ్ 11 టీమ్:

క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేస్ భరత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్‌వెల్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ సిరాజ్.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 26, 2021, 16:42 [IST]
Other articles published on Sep 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X