RCB vs MI: విరాట్ కోహ్లీపైకి బంతిని విసిరిన ముంబై పేసర్.. కారణం ఏంటంటే?!

దుబాయ్: ముందుగా బ్యాటర్ల బాధ్యతయుతమైన ఆటకు.. ఆ తర్వాత బౌలర్ల జోరు తోడవడంతో మూడు పరాజయాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తిరిగి విజయాల పట్టింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ (ఎంఐ)ను చిత్తు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (56; 37 బంతుల్లో 6×4, 3×6), విరాట్ కోహ్లీ (51; 42 బంతుల్లో 3×4, 3×6) మెరవడంతో మొదట ఆర్‌సీబీ 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది. హర్షల్ పటేల్ (4/17), మ్యాక్స్‌వెల్ (2/23), యుజ్వేంద్ర చహల్ (3/11) చెలరేగడంతో ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మంచి టచ్‌లో కోహ్లీ:
అయితే ఈ మ్యాచులో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఎంఐ పేసర్ ఆడమ్ మిల్నే తన అసహనం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కోహ్లీ మంచి టచ్‌లో కనిపించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే విరాట్ సిక్స్ బాదాడు. రెండో ఓవర్లో దేవదత్ పడిక్కల్ ఔట్ అయినా.. కోహ్లీ జోరు తగ్గలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ బాదాడు. మిల్నే వేసిన ఐదో ఓవర్లో మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు ఒక వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది. శ్రీకర్ భరత్ కూడా బౌండరీలతో చెలరేగడంతో బెంగళూరు స్కోర్ పరుగులు పెట్టింది. 10 ఓవర్లకు ఆర్‌సీబీ 82 రన్స్ చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
కోహ్లీపైకి బంతిని విసిరిన మిల్నే:
విరాట్ కోహ్లీకి గ్లెన్ మ్యాక్స్‌వెల్ తోడవ్వడంతో ముంబై కెప్టెన్ పదేపదే బౌలర్లను మార్చాడు. ఈ క్రమంలో 13వ ఓవర్ ఆడమ్ మిల్నే వేశాడు. మొదటి బంతిని మ్యాక్స్‌వెల్ ఫోర్ బాధగా.. రెండో బంతి 'నో బాల్' పడింది. రెండో బంతికి కూడా మ్యాక్సీ బౌండరీ బాదాడు. మూడో బంతికి పరుగు రాకపోగా.. నాలుగో బంతికి లెగ్ బైస్ రూపంలో ఓ పరుగు వచ్చింది. ఇదో బంతికి కోహ్లీ రెండు పరుగులు చేశాడు. చివరి బంతిని మిల్నే పూర్తిగా లెగ్ కట్టర్ వేయగా.. కోహ్లీ స్ట్రైట్ షాట్ ఆడాడు. బంతిని అందుకున్న మిల్నే.. కోపంలో కోహ్లీపైకి విసిరాడు. ఆ సమయంలో విరాట్ సహనంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే వివాదమే జరిగేది. ఇది చూసిన ఆర్‌సీబీ ఫాన్స్ స్లేడింగ్ చేయాలంటూ కోహ్లీని ఎంకరేజ్ చేశారు.

కోహ్లీ అరుదైన ఘనత:
ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. కోహ్లీ టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ, దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో కలుపుకొని 314 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఈ ఘతన సాధించాడు. భారత్ నుంచి పది వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (14275), కీరన్ పొలార్డ్ (11195), షోయబ్ మాలిక్ (10808), డేవిడ్ వార్నర్ (10019) కోహ్లీ కంటే ముందున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications