RCB vs KKR: కేకేఆర్‌కు అమ్ముడుపోయావా? అంపైర్‌పై కోహ్లీ అసహనం

RCB vs KKR: Virat Kohli Fires On Umpire Virender Sharma For Giving Wrong Decision
RCB vs KKR : Umpire 3 ఘోర LBW తప్పిదాలు Kohli On Fire అందుకే KKR గెలిచిందా ? || Oneindia Telugu

షార్జా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ -2 మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదాలు చర్చనీయాంశమయ్యాయి. ఇవన్నీ కేకేఆర్ జట్టుకు ఫేవర్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అంపైర్ ఉద్దేశ పూర్వకంగానే ఈ నిర్ణయాలు వెల్లడించాడా? అనే సందేహం కలుగుతోంది. అయితే డీఆర్‌ఎస్‌ల ద్వారా ఆర్‌సీబీ వీటన్నిటి నుంచి తప్పించుకుంది. దీంతో తీవ్ర అసహనానికి గురైన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫీల్డ్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో ఇన్ని తప్పులా? అని నిలదీస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అంపైర్ సైతం తన తప్పును అంగీకరించినట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది. కోహ్లీ దగ్గరకు వచ్చిన అంపైర్ ఏదో మట్లాడగా..కోహ్లీ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

ఫీల్డ్ అంపైర్ వీరేందర్ కుమార్ శర్మ మూడు ఘోర తప్పిదాలు చేశాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా షెబాజ్ అహ్మద్ ఏల్బీ విషయంలో ఔటిచ్చాడు. అయితే బంతి బ్యాట్ తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో రివ్యూ తీసుకున్న షెబాజ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇది ఔటివ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీరేందర్ శర్మ అంపైర్ స్కిల్స్‌పై సందేహం కలిగించింది. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డానియల్ క్రిస్టియన్ సైతం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్ ఎల్బీ విషయంలోను వీరేందర్ శర్మ ఇలానే ఔటిచ్చాడు.

మూడు తప్పిదాలు..

మూడు తప్పిదాలు..

అప్పుడు కూడా బంతిని బ్యాట్ తాకినట్లు రిప్లేలో స్పష్టమైంది. దాంతో అతను మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇక కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్భంగా రాహుల్ త్రిపాఠి ఔట్ విషయంలో వీరేందర్ శర్మ మరోసారి తప్పిదం చేశాడు. చాహల్ బౌలింగ్‌లో అతను వికెట్ల ముందు దొరికిపోగా.. వీరేందర్ శర్మ నాటౌటిచ్చాడు. ఇక రివ్యూ తీసుకునే విషయంలో ఆర్‌సీబీ ఆటగాళ్లంతా వెనకడుగు వేయగా.. కోహ్లీ మాత్రం రివ్యూ కెళ్లాడు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదని తేలడంతో వీరేందర్ శర్మ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా వరుసగా మూడు తప్పిదాలు చేయడంతో కోహ్లీ అతనిపై అసహనం వ్యక్తం చేశాడు. అభిమానులు సైతం వీరేందర్ శర్మ తీరును తప్పుబడుతున్నారు. అతని అంపైరింగ్‌ కేకేఆర్‌కు ఫేవర్‌గా ఉందని సందేహిస్తున్నారు. కేకేఆర్‌కు అమ్ముడుపోయాడేమోనని కామెంట్ చేస్తున్నారు.

నరైన్ షో...

నరైన్ షో...

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది. కేకేఆర్ బౌలర్లలో నరైన్‌కు తోడుగా..లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్‌వెల్‌(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత చేజింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభారంభం అందించగా.. ఆర్‌సీబీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అయితే మరోసారి నరైన్ ఆ జట్టును దెబ్బతీశాడు. బ్యాటింగ్‌లో మూడు సిక్స్‌లతో కేకేఆర్ విజయ సమీకరణాన్ని సులువు చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, October 11, 2021, 22:39 [IST]
Other articles published on Oct 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X