Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: స్టేడియంలో ఈతకొట్టిన టిమ్ డేవిడ్ ( వీడియో )

RCB vs KKR: ఐపీఎల్ 2025 రేపటి నుంచి అంటే మే 17 నుంచి మళ్లీ ఫ్రారంభమవుతోంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. దీని కోసం రెండు జట్లు బెంగళూరులో ఉన్నాయి. ఇంతలో బెంగళూరులో భారీ వర్షం కురిసింది. వర్షం పడుతుండగా.. ఆర్సీబీ విధ్వంసరకర బ్యాటర్ టిమ్ డేవిడ్ మైదానంలో సరదాగా గడుపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

వర్షం నీటిలో తేలుతూ కనిపించిన టిమ్ డేవిడ్
నిజానికి వర్షం కారణంగా చిన్నస్వామి స్టేడియం నిండిపోయింది. ఆ వర్షం నీటిలో టిమ్ డేవిడ్ ఈత కొడుతూ కనిపించాడు. ఈ డాషింగ్ ప్లేయర్ వర్షం నీటిలో చాలా సరదాగా గడుపుతూ కనిపించాడు. వర్షాన్ని ఆస్వాదించిన తర్వాత టిమ్ డేవిడ్ మళ్లీ ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు. వర్షం నీటిలో టిమ్ డేవిడ్ ఎంజాయ్ చేస్తుండగా.. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు టిమ్ డేవిడ్‌ను చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. టిమ్ డేవిడ్‌కు సంబంధించి ఈ ఫన్నీ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీనిని అభిమానులు కూడా లైక్ చేస్తున్నారు.

RCB vs KKR Tim David Swims in Stadium Rainwater Viral Video

అద్భుతంగా రాణిస్తోన్న టిమ్ డేవిడ్
ఐపీఎల్ 2025లో టిమ్ డేవిడ్ ఆర్సీబీలో భాగంగా ఉన్నాడు. మెగావేలంలో ఆర్సీబీ ఈ ఆటగాడిని రూ.3కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పడు ఈ ఆటగాడు ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు బ్యాటింగ్ చేసిన టిమ్ డేవిడ్ 193.75 స్ట్రైక్ రేట్‌తో 186 పరుగులు చేశాడు. అందులో ఒక ఙాఫ్ సెంచరీ కూడా ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టుపై టిమ్ డేవిడ్ ఈ అర్థ సెంచరీని సాధించాడు. ఆ సమయంలో జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో టిమ్ డేవిడ్ ఈ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే టిమ్ డేవిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ప్లేఆఫ్ టికెట్ కోసం ఆడనున్న ఆర్సీబీ
ఐపీఎల్ సీజన్ 18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణించింది. ఆర్సీబీ ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో ఆ జట్టు 8 గెలిచి 3 ఓడిపోయింది. ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆర్సీబీ కేకేఆర్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలనుకుంటోంది.

Story first published: Friday, May 16, 2025, 12:08 [IST]
Other articles published on May 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+