Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: కేకేఆర్ తుది జట్టులో కీలక మార్పు.. ఓడితే ఇంటికే!

RCB vs KKR: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో సర్వత్రా ఉత్సాహం నెలకొంది.

ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకోవడానికి కారణం
టాస్ గెలిచిన అనంతరం రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. గత మ్యాచ్ ఆడిన వికెట్ తరహాలోనే ఇది కూడా కనిపిస్తోందని, అందుకే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు వెల్లడించాడు. పిచ్‌పై బౌన్స్ అస్థిరంగా ఉండే అవకాశం ఉందని.. కోల్‌కతా బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేసి ఒత్తిడిలోకి నెట్టాలని తాము భావిస్తున్నట్లు చెప్పాడు. గత మ్యాచ్ విజయం జట్టులో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఆర్సీబీ జట్టులోకి షెపర్డ్ స్థానంలో వెంకటేష్ అయ్యర్ వచ్చాడు.

RCB vs KKR IPL 2026 Rajat Patidar Wins Toss Opts to Bowl A Must-Win Game for Rahane KKR Details

కేకేఆర్ ఆత్మవిశ్వాసం
కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. గత 4 మ్యాచ్‌లలో తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసిందని గుర్తు చేశాడు. తాము మ్యాచ్ ఫలితం గురించి కంటే, మైదానంలో ఎదురయ్యే చిన్న చిన్న అంశాల్లో పైచేయి సాధించడంపైనే దృష్టి పెడుతున్నామని చెప్పాడు. ప్రత్యర్థి జట్టును గౌరవిస్తూనే, ప్రణాళికాబద్ధంగా ఆడి విజయం సాధిస్తామని అన్నాడు. కేకేఆర్ తుది జట్టులో ఒక కీలక మార్పు జరిగింది.. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో సౌరభ్ జట్టులోకి వచ్చాడు.

ప్లేఆఫ్స్ లెక్కలు:
ప్రస్తుతం ఆర్‌సీబీ 14 పాయింట్లతో పటిష్ట స్థితిలో ఉండగా.. కేకేఆర్ 9 పాయింట్లతో పోరాడుతోంది. కేకేఆర్‌కు ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. మరోవైపు ఆర్‌సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్ స్టేడియం హోరాహోరీ పోరుకు సిద్ధమైంది.

తుది జట్లు ఇవే:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్

Story first published: Wednesday, May 13, 2026, 20:49 [IST]
Other articles published on May 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+