ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగగా.. అందులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ మ్యాచ్ కు సంబంధించిన 'పిచ్' వివాదం ముదురుతోంది. తాను అడిగినట్లు క్యూరేటర్ పిచ్‌ను తయారుచేయలేదని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రహానె వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించి విమర్శల పాలైన ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ.. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కితీసుకున్నారు. తానెప్పుడూ కేకేఆర్ విజ్ఞప్తులను తిరస్కరించలేదని పేర్కొన్నారు.
రహానే అలా.. క్యూరేటర్ ఇలా..
బెంగళూరుతో మ్యాచ్ అనంతరం రహానె మాట్లాడుతూ.. "పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని అనుకుంటే అలా జరగలేదు. మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఎలాంటి వికెట్‌పైనైనా అత్యుత్తమంగా బౌలింగ్ చేయగలరు" అని రహానె పేర్కొన్నాడు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ కొట్టిపారేశారు. సుజన్ ముఖర్జీ మాట్లాడుతూ.. "ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలకు పిచ్‌ను ఎలా తయారు చేయాలో చెప్పకూడదు. నేను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది. అయినా ఆర్సీబీ స్పిన్నర్లు 4 వికెట్లు తీశారు. మరి కేకేఆర్ స్పిన్నర్లు ఎందుకు తీయలేకపోయారు." అని అన్నారు.

నేను పట్టింకోనూ...
దీంతో ముఖర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అందుకే తాజాగా వెనక్కి తగ్గి.. తాను చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. "తొలి మ్యాచ్ అప్పుడు ఏ అధికారి లేదా ప్లేయర్ నన్ను సంప్రదించలేదు. ప్రాక్టీస్ సమయంలో కోచ్ మాత్రమే నన్ను అడిగారు. పిచ్ టర్న్ అవుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్నుపా. కేకేఆర్ విజ్ఞప్తులను నేనెప్పుడు తిరస్కరించలేదు. సుదీర్ఘకాలంగా ఆ జట్టుతో నాకు మంచి అనుబంధం ఉంది. బీసీసీఐ గైడ్‌లైన్స్ ప్రకారమే పిచ్‌ను తయారుచేశాను. నాపై ఆరోపణలు చేసే వారి గురించి పట్టించుకోను" అని ముఖర్జీ చెప్పారు.